ఈ ఐస్‌ క్రీమ్ ఖరీదు రూ.60వేలు… ఎందుకంటే…

సాధార‌ణంగా ఐస్‌ క్రీమ్ ధర ఎంత ఉంటుంది.  మామూలు ఐస్‌ క్రీమ్ రూ. 10 నుంచి ప్రీమియం అయితే రూ.1000 వ‌రకు ఉంటుంది.  కానీ, అన్ని ఐస్‌క్రీమ్‌ల్లోనూ ఈ ఐస్‌క్రీమ్ వేర‌యా అంటున్నారు స్కూఫీకెఫే నిర్వాహ‌కులు.  ఈ దీనిని త‌యారు చేయ‌డానికి తాజా వెనిల్లా గింజ‌లు, మేలిమి కుంకుమ పువ్వును వినియోగిస్తారు.  అంతేకాదు, దీనిపై 23 క్యారెట్ల బంగారం రేకులను అలంకరిస్తారు.  ఖరీదైన వస్తువులు వినియోగిస్తారు కాబట్టే ఈ ఐస్‌ క్రీమ్‌ను రూ.60 వేలకు అమ్ముతున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు.  ఈ ఐస్‌ క్రీమ్ గురించి తెలుసుకున్న బాలీవుడ్ నటి షెహనాజ్ ట్రెజ‌రీ దుబాయ్ వెళ్లి మరీ ఆర‌గించారు.  దీనికి సంబంధించిన వీడియోను షెహనాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైర‌ల్‌గా మారింది.

Read: ఎన్టీయార్ రియాలిటీ షో టెలికాస్ట్ ఎప్పుడంటే…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-