పెరిగిపోతున్న ప్రపంచం అప్పులు…

క‌రోనాకు ముందు ప్ర‌పంచ దేశాలు అన్ని రంగాల్లో దూసుకుపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తీ రంగంలో పోటీప‌డి విజ‌యం సాధిస్తూ వ‌చ్చాయి.  ఎప్పుడైతే క‌రోనా ఎంట‌ర్ అయిందో అప్ప‌టి నుంచి ప‌రిస్థితులు మారిపోయాయి.  ఆర్థికంగా బ‌లంగా ఉన్న దేశాలు సైతం క‌రోనా దెబ్బ‌కు ఆర్థికంగా కుదేల‌య్యాయి.  క‌రోనా వ‌ల్ల కుదేల‌వుతున్న ఆర్థిక ప‌రిస్థితుల‌ను గాడిన పెట్టేందుకు వివిధ దేశాలు పాల‌సీలు, ఆర్థిక ఉద్దీప‌న ప్యాకేజీల పేరుతో అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టాయి.  దీని వ‌ల‌న రికార్డ్ స్థాయిలో ప్ర‌పంచ దేశాల అప్పులు పెరిగిపోయాయి.  2021లో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రుణాల‌తో క‌ల‌పి మొత్తం 226 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు అప్పులు చేశాయి.  ఇందులో అమెరికా, చైనాల‌తో పాటు అభివృద్ధి చెందిన దేశాల వాటా 90 శాతం ఉన్న‌ట్టుగా అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి తెలియ‌జేసింది.  2020తో పోల్చితే ఈ అప్పు 27 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లు అధికమని ఐఎంఎఫ్ తెలియ‌జేసింది.  

Read: అక్టోబ‌ర్ 14, గురువారం దిన‌ఫ‌లాలు

-Advertisement-పెరిగిపోతున్న ప్రపంచం అప్పులు...

Related Articles

Latest Articles