భారత్‌కు 87 బిలియన్ల రిమిటెన్స్‌

వాషింగ్టన్‌ : ప్రస్తుత ఏడాది 2021లో భారత్‌కు 87 బిలియన్‌ డాలర్ల రెమిటెన్స్‌లు (విదేశీ మారకం) రావొచ్చని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. 2022లో ఇది 89.6 బిలియన్‌ డాలర్లకు పెరుగొచ్చని పేర్కొంది. 2021లో చిన్న, మధ్యస్థ ఆదాయాలు కలిగిన దేశాల రిమిటెన్స్‌లు 7.3 శాతం పెరిగి మొత్తంగా 589 బిలియన్‌ డాలర్లుగా ఉండొచ్చని పేర్కొంది.

కరోనా సంక్షోభంతో 2020లో ఈ రిమిటెన్స్‌ల్లో 1.7 శాతం తగ్గుదల చోటు చేసుకుందని ప్రపంచ బ్యాంక్‌ తన మైగ్రేషన్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో వలస వెళ్లిన ఉద్యోగులు తమ కుటుంబాలకు అధిక మొత్తాలను పంపించడం ద్వారా రిమిటెన్స్‌లు పెరుగనున్నాయని ప్రపంచ బ్యాంక్‌ గ్లోబల్‌ డైరెక్టర్‌ ఫర్‌ సోషల్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ జాబ్స్‌ మైకెల్‌ రుట్‌కోస్కి పేర్కొన్నారు.

Related Articles

Latest Articles