వైజాగ్ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ‌: ఉద్య‌మం ఉధృతం…

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రంచే దిశ‌గా కేంద్రం అడుగులు వేస్తున్న‌ది. ఇప్ప‌టికే కేంద్రం ఈ విష‌యంలో వెనక్కి త‌గ్గేది లేద‌ని పార్ల‌మెంట్‌లో స్పష్టంచేసింది.  దీంతో కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్య‌మం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  గ‌త కొంత కాలంగా ఉద్య‌మం చేస్తున్నా కేంద్రం దిగిరాక‌పోవ‌డంతో ఉద్య‌మాన్ని ఉధృతం చేస్తున్న‌ట్టు విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ పోరాట‌క‌మిటీ ప్ర‌క‌టించింది.  ఆర్చి నుంచి వడ్ల‌పూడి నిర్వాసిత ప్రాంతాల్లో పాద‌యాత్ర చేస్తున్నారు.  ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని కేంద్రం వెన‌క్కి తీసుకునే వ‌ర‌కూ పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్రైవేటీక‌రించ‌డం వ‌ల‌న ఇబ్బందులు వ‌స్తాయ‌ని, ఉద్యోగాలు, ఉపాది కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని కార్మికులు ఆందోళ‌న చెందుతున్నారు.  అయితే, కేంద్రం మాత్రం మ‌రో విధంగా చెబుతున్న‌ది.  వైజాగ్ స్టీల్‌ను ప్రైవేటీకరించ‌డం వ‌ల‌న స్టీల్ ప్లాంట్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని,  ఉపాది అవ‌కాశాలు పెరుగుతాయ‌ని చెబుతున్న‌ది.

Read: ఒలంపిక్స్ లో సింధు శుభారంభం…

Related Articles

Latest Articles

-Advertisement-