కోవిడ్ టెర్రర్.. వారికి వర్క్ ఫ్రం హోం అవకాశం

దేశంలో కరోనా భయం వీడలేదు. కనిపించని శత్రువు సవాల్ విసురుతోంది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో… కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీ, దివ్యాంగ ఉద్యోగులకు విధులకు హాజరుకాకుండా మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ప్రకటించారు. వారికి ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇచ్చారు.

కోవిడ్​ కంటైన్​మెంట్​ జోన్లలో నివాసం ఉంటున్న అధికారులు, ఇతర సిబ్బందికి కూడా మినహాయింపు ఉంటుందని జితేంద్ర సింగ్‌ తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కార్యదర్శి కంటే కిందిస్థాయి ఉద్యోగుల హాజరును 50 శాతానికి పరిమితం చేయనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

మిగతా 50 శాతం మంది ఇంటి నుంచి పనిచేస్తారు. కంటైన్మెంట్ జోన్ ల నుంచి ఆయా ప్రాంతాలను తొలగించేవరకూ వర్క్ ఫ్రం హోం అవకాశం వుంటుంది. వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులు వివిధ అధికారిక సమావేశాలను దాదాపు వీడియో కాన్ఫరెన్స్​ పద్ధతిలోనే నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ రూల్స్ జనవరి 31వరకు అమల్లో ఉండనున్నట్లు ప్రకటనలో తెలిపింది.

Related Articles

Latest Articles