కరోనా ఆంక్షలు మరింత కఠినం.. అన్ని ఆఫీసులు మూత..

దేశ రాజధాని ఢిల్లీపై కరోనా పంజా విసురుతోంది.. ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు విధించింది ఢిల్లీలోని అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కార్‌.. అయినా.. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రైవేట్ ఆఫీసులను మూసివేయాలని నిర్ణయించింది. ఎమర్జన్సీ సర్వీసులు మినహా మిగిలిన ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించింది. మినహాయించిన కేటగిరీకి చెందిన ప్రైవేట్‌ కంపెనీలు మినహా అన్ని ఆఫీసులు మూసివేయాల్సిందేనని పేర్కొంది.. ఇప్పటి వరకు, కార్యాలయాల్లో 50 శాతం మంది ఉద్యోగులతో పనిచేసుకునే వీలు ఉండగా.. మిగతావారు ఇంట్లో ఉండి పనిచేసేవిధంగా ఆంక్షలు ఉండగా.. ఇప్పుడు పూర్తిగా వర్క్‌ఫ్రమ్‌ హోంకే పరిమితం కావాలని స్పష్టం చేసింది ప్రభుత్వం..

Read Also: కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం.. మరో 15 కొత్త కేసులు

ఇక, నిన్న, ఢిల్లీలోని అన్ని రెస్టారెంట్లను మూసివేశారు.. కేవలం టేక్‌అవేలు మరియు హోమ్ డెలివరీ సర్వీసులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. కాగా, ఢిల్లీలో నిన్న 19,000 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.. ఆదివారం 22,751 కేసులతో పోలిస్తే.. పాజిటివ్‌ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినా.. కోవిడ్‌ ఆంక్షలను మాత్రం కఠినంగా అమలు చేస్తోంది ఢిల్లీ సర్కార్.

Related Articles

Latest Articles