బీజేపీ మహిళా ఎమ్మెల్సీ ఉచిత సలహా.. మహిళలపై అఘాయిత్యాలు తగ్గాలంటే..!

మహిళలపై వరుసగా జరుగుతోన్న అఘాయిత్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.. అయితే, అఘాయిత్యాలు జరిగిన తర్వాత స్పందించడం కాదు.. వాటిని ముందే కట్టడి చేయాలన్న డిమాండ్‌ క్రమంగా బలపడుతోంది.. ఈ తరుణంలో బీజేపీకి చెందిన మహిళా ఎమ్మెల్సీ భారతి శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు.. శాసన మండలిలో మైసూరు గ్యాంగ్ రేప్ ఘటనపై జరిగిన చర్చలో పాల్గొన్న భారతి శెట్టి.. మహిళా ఉద్యోగినుల భద్రత కోసం రాత్రి వేళల్లో ఓవర్ టైం పనిచేయడానికి అనుమతించరాదని సూచించారు కర్ణాటకకు చెందిన ఈ బీజేపీ ఎమ్మెల్సీ .. దానికి కారణంగా కూడా వివరించిన ఆమె.. రాత్రివేళల్లో పనిచేస్తున్న మహిళలు లక్ష్యంగా నేరాలు జరుగుతున్నాయని.. అందుకు ఓవర్ టైం పనిచేసేందుకు వారిని అనుమతించ కూడదని సలహా ఇచ్చారు.. ఇక, నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడానికి న్యాయవ్యవస్థకు కోరలు లేవని, అందువల్ల నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. ఈ ఘటలను నిర్మూలించాలంటే కఠినతరమైన కొత్త చట్టాలు అవసరంఅని తెలిపారు. అయితే, బీజేపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు.. ఆమె వ్యాఖ్యలు మహాత్మాగాంధీ కల రామరాజ్య స్ఫూర్తితో లేవని, మహిళల భద్రత అన్ని సమయాల్లో ఉండేలా చూడాలని సూచించారు ప్రతపక్ష నేత ఎస్ఆర్ పాటిల్.

-Advertisement-బీజేపీ మహిళా ఎమ్మెల్సీ ఉచిత సలహా.. మహిళలపై అఘాయిత్యాలు తగ్గాలంటే..!

Related Articles

Latest Articles