మ‌హిళా ఎంపీని బ‌హిష్క‌రించిన పార్ల‌మెంట్‌…కారణం తెలిస్తే షాక్‌…

మ‌హిళ‌లు బ‌య‌ట ఎలా ఉన్నా.. చ‌ట్ట స‌భ‌ల్లోకి అడుగుపెట్టే స‌మ‌యంలో మాత్రం సంప్ర‌దాయ‌బ‌ద్దంగా దుస్తులు ధ‌రించి వ‌స్తుంటారు.  అయితే, సంప్ర‌దాయ‌బ‌ద్దంగా కాకుండా బిగుతైన జీన్స్ ధ‌రించి పార్ల‌మెంట్ కు వ‌చ్చినందుకు మ‌హిళా ఎంపీని బ‌య‌ట‌కు పంపించారు.  ఈ ఘ‌ట‌న టాంజానియా పార్ల‌మెంట్‌లో జ‌రిగింది.  ఎంపి కండెక్ట‌ర్ స్విచాలే బిగుతైన జీన్స్ ధ‌రించి పార్ల‌మెంట్ కు హాజ‌రైంది.  స‌హ‌చ‌ర ఎంపీల నుంచి ఫిర్యాదులు అంద‌డంతో స్పీక‌ర్ ఆమెను బ‌య‌ట‌కు పంపారు.  మంచి దుస్తులు ధరించి పార్ల‌మెంట్‌కు హాజ‌రుకావాల‌ని ఆదేశించారు.  ఎంపీలే ఇలాంటి బ‌ట్ట‌లు వేసుకొని పార్ల‌మెంట్‌కు హాజ‌రైతే స‌మాజానికి ఏం మేసేజ్ ఇస్తున్న‌ట్టు అని ప్ర‌శ్నించారు స్పీక‌ర్‌.  టాంజానియా పార్ల‌మెంట్ నిబంద‌న‌ల ప్ర‌కారం జీన్స్ ధ‌రించి చ‌ట్ట‌స‌భ‌ల‌కు హాజ‌రుకాకూడ‌దు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-