వైఎస్‌ షర్మిల దీక్ష.. డబ్బులివ్వలేదని అడ్డా కూలీల ఆందోళన..

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. నిరుద్యోగ సమస్యను ఆయుధంగా మలచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.. దీనికోసం ప్రతీ మంగళవారం ఒక చోట నిరుద్యోగ దీక్ష చేస్తూ వస్తున్నారు.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తూ.. వారికి ఆర్థికసాయం చేయడం.. ఆ తర్వాత కొన్ని గంటల పాటు దీక్ష చేస్తూవస్తున్నారు. అయితే, దీక్ష కోసం తమను తీసుకొచ్చి డబ్బులివ్వడం లేదని ఆరోపిస్తూ అడ్డా కూలీలు ఆందోళనకు దిగడం చర్చగా మారింది.. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి.. 50 మందిని తీసుకొచ్చారని అంటున్నారు.. ఇప్పుడు డబ్బులు అడిగితే ఇవ్వడంలేదంటూ ఆందోళనకు దిగారు.. అయితే, మీడియాతో మాట్లాడుతున్న మహిళలకు నచ్చజెప్పిన నాయకులు దూరంగా తీసుకెళ్లారు. మరోవైపు.. వైఎస్‌ షర్మిల చేపట్టే దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. నాయకులు, కార్యకర్తలు.. దీక్షా స్థలి దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, ఇవాళ బోడుప్పల్‌లోని ఎగ్జిబిషన్‌ మైదానంలో వైఎస్‌ షర్మిల నిరుద్యోగ దీక్షకు దిగాలని నిర్ణయించారు.. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. ఇది రద్దు చేయాల్సి వచ్చింది..

Related Articles

Latest Articles