శ్రీధర్‌రావు నాతో అన్ నేచురల్ సెక్స్ చేశాడు : జిం ట్రైనర్‌

సంధ్య కన్వెన్ష ఎండీ శ్రీధర్‌రావు బాగోతాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే భూ విషయాలలో పలువురిని బెదిరించినట్లు శ్రీధర్‌రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ జిం ట్రైనర్‌ శ్రీధర్‌రావుపై సనత్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీధర్ రావు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాడీ మసాజ్ పేరుతో తనకు ఇంటికి పిలిచారని పేర్కొన్న జిమ్ ట్రైనర్.. బాడీ మసాజ్ చేస్తుండగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో వెల్లడించాడు.

శ్రీధరరావు తనతో అన్ నేచురల్ సెక్స్ చేశాడని, ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపాడు. అంతేకాకుండా శ్రీధర్ రావు తనను వ్యక్తిగతంగా చాలాసార్లు బెదిరించాడని జిం ట్రైనర్‌ పేర్కొన్నాడు. అయితే శ్రీధర్‌రావు బాధితులు ఒక్కక్కరిగా బయటకు వస్తున్నారు. శ్రీధర్‌రావు అరెస్ట్‌ అనంతరం బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు.

Related Articles

Latest Articles