సైనా నెహ్వాల్ నూ వదలని సిద్దార్థ్.. మండిపడుతున్న మహిళా లోకం

సిద్దార్థ్.. సిద్దార్థ్.. సిద్దార్థ్ ప్రస్తుతం ట్విట్టర్ లో ఈ హీరో నామజపం చేస్తున్నారు అందరు.. రాజకీయ పరంగా, సినిమాపరంగా తన మసులో ఏం అనుకుంటే దాన్ని నిర్మొహమాటంగా ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఉంటాడు. అంటించేది అంటించి.. చివరకు నేను వారిని అనలేదు.. వీరిని అనలేదు అంటూ చెప్పుకొస్తాడు. ఇలా సిద్దు చేసిన వివాదాలు చాలానే ఉన్నాయి. ఇక తాజాగా మరోసారి సిద్దు ట్విట్టర్ వివాదం మొదలయ్యింది. ఈసారి సినీ, రాజకీయ ప్రముఖలనే కాకుండా క్రీడాకారులను కూడా తీసుకురావడం చర్చనీయాంశం అయ్యింది. భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి.

ఇటీవల సైనా ప్రధాని మంత్రి మోడీపై జరిగిన దాడి ఒక పిరికిపంద చర్య అని తెలుపుతూ తన అభిప్రాయాన్ని ట్వీట్ ద్వారా తెలిపింది. ఆ ట్వీట్ పై సిద్దు స్పందిస్తూ “ఓ చిన్న కాక్ తో ఆడే ఆటలో ప్రపంచ ఛాంపియన్.. దేవుడి దయ వల్ల మనకు దేశాన్ని కాపాడేవాళ్లున్నారు” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. చివర్లో సైనా పేరును రిహానా అంటూ మార్చి చెప్పాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఒక స్త్రీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిద్దుపై మహిళా లోకం మండిపడుతోంది.

ఇప్పటికే సింగర్ చిన్మయి సిద్దు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంతో మూర్ఖత్వం.. ఒకప్పుడు సిద్దార్థ్ మహిళలు చేసే ఎన్నో పనులకు సపోర్ట్ గా నిలిచాడు. ఇప్పుడు అతను ఇలా మాట్లాడడం బాధాకరం” అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన వ్యాఖ్యలను సిద్ధార్థ్ సమర్ధించుకుంటూ మరో ట్వీట్ లో ” కాక్ అండ్ బుల్ ఇది రిఫరెన్స్.. దాన్ని మరో విధంగా అన్వయించడం అనైతికం.. ఎవరిని కించపర్చడానికి ఈ ట్వీట్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా సిద్దు మరోసారి పెద్ద వివాదానికే తెరలేపాడు. ఇది ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Related Articles

Latest Articles