బాబోయ్… యువ‌తి సాహాసాన్ని చూస్తే..

మామూలుగా మ‌నం పాము క‌నప‌డితే ఆమ‌డ దూరం ప‌రిగెడ‌తాం.  లేదంటే పాములు ప‌ట్టుకునే వారికి ఫోన్ చేస్తాం.  కానీ, ఆ యువ‌తి మాత్రం అలా చేయ‌లేదు.  రోడ్డుపక్క‌న భ‌యంక‌రమైన పాము క‌నిపించ‌గానే వెంట‌నే దాని తోక ప‌ట్టుకుంది.  అనంత‌రం దాని త‌ల‌ను ప‌ట్టుకుంది.  ఆమె చేతి నుంచి త‌ప్పించుకొని పారిపోయేందుకు పాము శ‌త‌విధాలా ప్ర‌య‌త్నం చేసింది.  కానీ, ఆమె దాన్ని వ‌ద‌ల‌లేదు.  పైగా పామును బెల్టు మాదిరిగా న‌డుముకు చుట్టుకొని త‌నకేమి తెలియ‌ద‌న్న‌ట్టు అక్క‌డి నుంచి వెళ్లిపోయింది.  ఈ ఘ‌ట‌న వియాత్నంలో జ‌రిగింది.  దీనికి సంబందించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-