విచిత్రం: ఒకే గ్రామంలో రెండు భాష‌లు…

ఒక రాష్ట్రంలో అనేక భాష‌లు ఉండొచ్చు.  దేశంలో అనేక భాష‌లు ఉంటాయి.  కానీ, ఒక గ్రామంలో రెండు భాష‌లు ఉండ‌టం ఎక్క‌డైనా చూశారా అంటే లేద‌ని చెప్తాం.  కానీ, ఆ గ్రామంలో ప్ర‌జ‌లు రెండు భాష‌లు మాట్లాడ‌తారు.  అందులోనూ పురుషులు ఒక భాష మాట్లాడితే, మ‌హిళ‌లు మ‌రో భాష మాట్లాడ‌తారు.  ఇద్దరూ రెండు ర‌కాల భాష‌లు మాట్లాడ‌టం విశేషం.  ఆఫ్రికా దేశంలోని నైజీరియాలో ఉన్న ఉబాంగ్ అనే గ్రామంలో ఇలా రెండు ర‌కాల భాష‌లు మాట్లాడ‌తార‌ట‌.  మ‌హిళ‌లు ఒక భాష మాట్లాడితే, పురుషులు మ‌రోక భాష‌ను మాట్లాడ‌తారు.  రెండు ర‌కాల భాష‌లు ఇద్ద‌రికీ వ‌స్తాయి.  కానీ, పురుషులు మాట్లాడే భాష‌ను మ‌హిళ‌లు, మ‌హిళ‌లు మాట్లాడే భాష‌ను పురుషులు మాట్లాడ‌రు.  ప‌దేళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు పిల్ల‌లు ఏ భాషైనా మాట్లాడ‌వ‌చ్చు.  ప‌దేళ్లు దాటిన త‌రువాత వారు కూడా వేరు వేరు భాష‌లు మాట్లాడాలి.  స్త్రీలు మాట్లాడే భాష‌ను పురుషులు మాట్లాడితే చుల‌క‌న‌గా చూస్తారు. అందుకే ఎవ‌రి భాష‌ను వారే మ‌ట్లాడ‌తార‌ట‌.  అయితే, వారు మాట్లాడే భాష‌కు లిపిలేక‌పోవ‌డంతో రాబోయే రోజుల్లో వారి భాష అంత‌రించిపోతుందేమో అని భ‌య‌ప‌డుతున్నారు.  

Read: రివ‌ర్స్ బైక్‌…సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్‌…

Related Articles

Latest Articles

-Advertisement-