వైర‌ల్‌: మొస‌లిని చెప్పుతో బెద‌ర‌గొట్టిన మ‌హిళ‌…సాహ‌సానికి నెటిజ‌న్లు ఫిదా…

నీటిలోనూ, నేల‌మీద బ‌ల‌మైన జ‌ల‌చ‌ర‌జీవి మొస‌లి.  నీటిలో ఉన్న‌ప్పుడు దాని బ‌లం ఎంత ఉంటుందో చెప్పాల్సిన అవ‌సరం లేదు.  అయితే, భూమిపైకి వ‌చ్చిన‌పుడు దాని బ‌లం చాలా వ‌రకు త‌గ్గిపోతుంది. ఇక మొస‌లితో పోరాటం చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు.  దాని నోటికి చిక్కితే ఏదైనా స‌రే క‌డుపులోకి పోవాల్సిందే.  ఓ మ‌హిళ త‌న పెంపుడు కుక్క‌తో క‌లిసి న‌ది ఒడ్డున నిల‌బ‌డింది.  

Read: ఆ చెక్‌డ్యామ్‌ను బాంబుల‌తో పేల్చివేసిన ప్ర‌భుత్వం… ఇదే కార‌ణం…

కుక్క‌పిల్ల‌ను చూసిన మొస‌లి ఎలాగైనా దాన్ని తినెయ్యాల‌ని చెప్పి బ‌ర‌బ‌రామ‌ని ఒడ్డుకు వ‌చ్చింది.  ఒడ్డున నిల‌బ‌డి ఉన్న మ‌హిళ త‌న చెప్పును తీసి మొస‌లివైపు చూపుతూ బెదిరించింది.  మ‌హిళ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డిపోయిన మొస‌లి వెన‌క్కి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన చిన్న క్లిప్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ కాగా, నెటిన్లు ఫిదా అవుతున్నారు.  మ‌హిళ చెప్పుతీసుకొని బెదిరిస్తే మొస‌లి ఎలా భ‌య‌ప‌డిందో అర్థం కావ‌డంలేదంటూ ట్వీట్ చేస్తున్నారు.  

Related Articles

Latest Articles