మరో దారుణం.. మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారం.. ఆపై..!

దేశంలో ఏదో ఓ చోట ప్రతీ రోజు మహిళలపై అఘాయిత్యాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. సాధారణ మహిళలే కాదు.. ప్రభుత్వ విధుల్లో కీలకంగా పనిచేస్తున్నవారు కూడా ఈ వేధింపులకు, అఘాయిత్యాలకు బలిఅవుతున్నారు. ఇక, పోలీసులు అంటేనే.. చాలా మంది వణికిపోతారు.. కానీ, ఓ మహిళా కానిస్టేబుల్‌ను సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని.. పార్టీ ఉందంటూ ఆహ్వానించిన ఓ వ్యక్తి ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డడాడు.. ఇక, వీడియో తీసి బెదిరింపులకు పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ జిల్లాలో జరిగిన ఘటను సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 30 ఏళ్ల వయస్సున్న బాధిత కానిస్టేబుల్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయిన నిందితుడు.. ఆ పరిచయాన్ని ఫేస్‌బుక్‌ నుంచి వాట్సప్‌ వరకు తీసుకెళ్లారు.. తరచూ బాధిత మహిళా కానిస్టేబుల్‌తో చాటింగ్ చేసేవాడు.. ఇక, కొన్ని రోజుల తర్వాత అతడిలోని కన్నింగ్‌ ఫెలో నిద్రలేచాడు.. ఈ నెల ఆరంభంలో తన సోదరుడి పుట్టిన రోజు ఉందంటూ.. ఆ ఫంక్షన్‌ను రావాలంటూ బాధితురాలని ఆహ్వానించాడు. అతడి మాటలు నమ్మి వెళ్లిన బాధితురాలిపై ముగ్గురు వ్యక్తులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.. ప్రధాన నిందితుడు, అతడి సోదరుడు, మరో వ్యక్తి కలిసి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఇక, ఆ ఘటనను వీడియో కూడా తీశారని ఫిర్యాదులో పేర్కొంది.. నిందితుడి తల్లి తనను బెదిరించిందని, వారి బంధువు ఒకరు తనను చంపేస్తానని హెచ్చరించారని గోడు వెల్లబోసుకుంది.. మొదట నీముచ్‌లో పనిచేసిన ఆ బాధిత కానిస్టేబుల్‌ ప్రస్తుతం ఇండోర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నట్టు చెబుతున్న పోలీసులు.. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల ఆరంభంలో ఈ ఘటన జరగగా.. ఈ నెల 13వ తేదీన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది.. ప్రధాన నిందితుడి తల్లి సహా ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు కాగా.. ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.

Related Articles

Latest Articles