దారుణం.. భర్త, కుమారుడి ముందే మహిళపై అత్యాచారం

రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతుంది. కామాంధులు ఆడది కనిపిస్తే చాలు కామంతో రగిలిపోతూ కామ వాంఛ తీర్చుకోవడానికి సిద్దమైపోతున్నారు. వావివరుస విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక మహిళను కొంతమంది వ్యక్తులు భర్త, కుమారుడి ముందే అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితులను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. జయపురం స్థానిక సమితిలో ఒక వ్యక్తి, భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల జయపురం సమితి కుములిపుట్‌ పంచాయతీ ప్రాంతానికి చెందిన మీణా హరిజన్‌, అతని స్నేహితులు ఆ వ్యక్తి భార్యపై కన్నేశారు. వారి ఇంట్లోకి దూరి భర్తను, కుమారుడిని కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడి పరారయ్యారు. అనంతరం భర్త, భార్యను తీసుకొని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం మీణా హరిజన్‌ ని అరెస్ట్ చేశారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. నిందితులను అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని కాంగ్రెస్, బీజేపీ సహా ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నారు.

Related Articles

Latest Articles