రన్నింగ్‌ ట్రైన్‌లో యువతిపై దారుణం

దేశంలో రోజు ఏదో ఒక మూల ఆడగాళ్లపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. వాళ్లు ఎక్కడున్నా రక్షణ కరువవుతోన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి… తాజాగా, మహారాష్ట్ర ఠాణె జిల్లాలో దారుణం వెలుగు చూసింది.. శుక్రవారం రాత్రి రైలులోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు.. రైలులో ఉన్నవాళ్లను భయబ్రాంతులకు గురిచేస్తూ బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల వద్ద నుంచి డబ్బు, నగలు దోచుకున్నారు.. ఆపై ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లఖ్‌నవూ నుంచి ముంబై వెళ్లున్న పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌.. ఇగత్‌పురి, కాసారా రైల్వేస్టేషన్‌ మధ్య కొండ ప్రాంతానికి చేరుకున్న సమయంలో.. రైలు స్పీడ్‌ తగ్గింది.. ఆ సమయంలో 8 మంది దుండగులు రైలులోని డీ-2 బోగిలోకి చొరబడ్డారు… ఆయుధాలతో ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేశారు.. విలువైన వస్తువులు, ఫోన్లు, నగలు, నగదు లాగేసుకున్నారు.. ఎదురుతిరిగివారిపై దాడి చేశారు.. ఇకే, రైలులోనే ప్రయాణిస్తున్న 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.. అయితే, రైలు కాసారా రైల్వేస్టేషన్‌కు చేరుకోవడంతో ఒక్కసారి ప్రయాణికులు సహాయం అరిచారు.. దీంతో.. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు.. రంగంలోకి దిగి నలుగురిని అరెస్ట్ చేశారు..

-Advertisement-రన్నింగ్‌ ట్రైన్‌లో యువతిపై దారుణం

Related Articles

Latest Articles