మరిది మోజులో వదిన.. అర్ధరాత్రి వరకు ఆ పనిలోనే.. చివరకు

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో నిప్పులు పోస్తున్నాయి. కట్టుకున్నవారి దగ్గర సుఖం దొరకట్లేదని పరాయి వారి మోజులో పడుతున్నారు. చివరికి కన్నవారికి, కట్టుకున్నవారికి దూరమవుతున్నారు. తాజాగా ఒక వివాహిత .. వావి వరస మరిచి మరిదితో అఫైర్ పెట్టుకోంది. ఆ విషయం కొద్దిరోజులకు భర్తకు తెలిసి చీవాట్లు పెట్టాడు. అంతే.. ప్రియుడితో పాటు ఇంట్లోనుంచి పారిపోయి శవాలుగా తేలారు. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరిలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే..ఏలూరు కొత్తపేటకు చెందిన ఒక మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు.. అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో ఫేస్ బుక్ చిచ్చుపెట్టింది. ఫేస్ బుక్ లో వరుసకు మరిది అయ్యే హేము ఆమెకు పరిచయమయ్యాడు. నిత్యం అతడితో చాటింగ్ లో మునిగిపోయి భర్తను, పిల్లలను మర్చిపోయింది. అర్ధరాత్రి, అపరాత్రి అనే లేకుండా అతడితోనే చాటింగ్ చేస్తూ ఉండేది. ఇక ఈ క్రమంలోనే వారి మధ్య శారీరక సంబంధం కూడా మొదలయ్యింది. భర్త లేనప్పుడు మరిదితో రాసలీలలు కొనసాగించేది. ఇక ఇలా కొనసాగతున్న క్రమంలో భర్తకు ఒకరోజు భార్యపై అనుమానం వచ్చి నిఘా పెట్టగా విషయం తెలిసింది. దీంతో అతడు భార్యను హెచ్చరించాడు.

పిల్లలను పెట్టుకొని ఇలాంటి పాడుపని చేయడానికి సిగ్గు లేదా అంటూ తిట్టి మరోసారి ఇలా చేయొద్దని హెచ్చరించాడు. ఈ విషయం కూడా మరిదికి చేరవేసిన మహిళ అతడు చెప్పిన ప్లాన్ ప్రకారం ఇంట్లోంచి పారిపోయింది. భర్తకు విషయం తెలియడంతో తమ ఎఫైర్ ఇక సాగదని అనుకోని ఇద్దరు ఏలూరు పవర్ పేట రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహం పక్కనే తమ చావుకు ఎవరు బాధ్యులు కాదని తెలుపుతూ సూసైడ్ లెటర్ దొరకడంతో ఇది ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Related Articles

Latest Articles