కానిస్టేబుల్ తో ప్రేమాయణం.. భర్తను, కూతుళ్లను వదిలి ఆ భార్య

ఎంతో అందమైన కుటుంబం.. ప్రేమించే భర్త.. బంగారం లాంటి ఇద్దరు కూతుళ్లు.. నిత్యం వారి అల్లరితో ఆ కుటుంబంలో నవ్వుల హరివిల్లు పూసేది. అలాంటి కుటుంబంలో చిచ్చుపెట్టింది వివాహేతర సంబంధం.. పరాయి వ్యక్తి మోజులో భర్తను మరిచింది ఆ భార్య.. చివరికి ప్రియుడితో గొడవ కావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఇద్దరు కూతుళ్లను అనాధులుగా మార్చింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. శిడ్లఘట్ట పట్టణంలోని మారమ్మ దేవాలయం సర్కిల్‌లో నివాసం ఉంటున్న వెంకటేష్, రాజేశ్వరి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు.. వెంకటేష్ కూలి పనులకు వెళ్తుంటాడు. ఈ నేపథ్యంలోనే రాజేశ్వరికి శిడ్లఘట్టలోనే ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసే అనంత్ కుమార్ తో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. నాలుగేళ్లుగా వీరు ఎవరి కంటపడకుండా రాసలీలలు సాగిస్తున్నారు. ఇక ఇటీవల ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మనస్థాపానికి గురైన రాజేశ్వరి మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య విగతజీవిగా కనిపించేసరికి భర్త వెంకటేష్ భోరున విలపించాడు. తన భార్యను అనంత్ కుమారే హత్య చేశాడని వెంకటేష్ ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Related Articles

Latest Articles