అర్ధరాత్రి లవర్స్ శృంగారం చేస్తుండగా చూసిన మహిళ.. తెల్లారేసరికి శవంలా

ఒక తప్పు.. ఎన్నో తప్పులకు నాంది పలుకుతుంది.. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తే.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు.. ప్రస్తుతం సమాజంలో ఇలా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేసేవాళ్ళే ఎక్కువ.. తాజాగా తాము చేసిన ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఒక మహిళను అతి కిరాతకంగా నరికి చంపాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని రాజస్మంద్ నగర సమీపంలో ఉన్న అమరతియా గ్రామంలో కంకుభాయి(42) అనే మహిళ కుటంబంతో కలిసి నివసిస్తోంది. వారికి ఆ గ్రామంలోనే కొద్దిగా పొలం ఉండడంతో బార్యభర్తలిద్దరూ అక్కడే వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. నిత్యం పొలంలో నీళ్లు పెట్టడానికి వెళ్లిన భర్తకు భోజనం తీసుకొని వెళ్తోంది కంకుభాయి. ఎప్పటిలాగే రెండు రోజుల క్రితం కూడా భర్తకు భోజనం తీసుకొని పొలానికి బయల్దేరింది. భర్తకు భోజనం పెట్టాలని హడావిడిగా బయల్దేరిన ఆమెకు మార్గ మధ్యంలో ఒక ప్రేమ జంట శృగారం చేస్తూ కనిపించారు. ఆ పరిస్థితిలో ఆ జంట ఆమెను చూసి షాక్ అయ్యారు. ఈ విషయం ఆమె ఎక్కడ ఊర్లో వారికి చెప్తుందో అని బయపడి దారుణానికి ఒడిగట్టారు. కంకుభాయిని పట్టుకొని, నోరునొక్కి గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. ఆమె కాళ్లు నరికి తీసుకువెళ్లారు.

ఉదయం పొలంలో కంకుభాయి శవం కనిపించడంతో గ్రామస్థులు ఏదైనా జంతువు ఈ పని చేసిందని అనుకున్నారు. అయితే మరి కాళ్లు ఏమైనట్లు అనే అనుమానం పోలీసులను తొలిచివేసింది. దీంతో ఆ పొలం చుట్టుపక్కల ఎవరు వచ్చారు అని ఆరాతీయగా ఆ రాత్రి పక్క గ్రామానికి చెందిన గోపి అనే యువకుడి వచ్చినట్లు తెలుసుకున్నారు. అనంతరం అతడిని తమదైన రీతిలో ప్రశ్నించేసరికి నిజం బయటపెట్టాడు. తన ప్రేయసితో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆమె చూసిందని, బయట ఎవరికైన చెప్తుందనే భయంతో తానే హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. ఆమె కాళ్లకు వెండి కడియాలు ఉన్నాయని, కాళ్లు నరికి తీసుకువెళ్తే దొంగతనం కింద వస్తుందని ఆ పని చేసినట్లు చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

Related Articles

Latest Articles