భారత్ తో టీ20 సిరీస్ కు విలియమ్సన్ దూరం…

రేపటి నుండి భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో కివీస్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారత్ తో టీ20 సిరీస్ నుండి తప్పుకున్నాడు. ఈ విషయం తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. నవంబర్ 25 నుండి ఇండియాతో కాన్పూర్‌లో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ పై దృష్టి పెట్టడానికి కేన్ విలియమ్సన్ టీ20 సిరీస్‌కు దూరమవుతున్నాడు అని ప్రకటించింది.

Read Also : ముంబై ఎయిర్ పోర్ట్ లో ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చిన పాండ్యా…

అలాగే కెప్టెన్ సిరీస్ నుండి తప్పుకోవడంతో రేపటి నుండి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ లో కివీస్ జట్టుకు టిమ్ సౌథీ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు అని తెలిపింది. ఇక ఈ ఆదివారం ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఓడిన తర్వాత న్యూజిలాండ్ జట్టు నిన్న జైపూర్ కు చేరుకుంది. అయితే భారత్, కివీస్ మధ్య మొదటి టీ20 మ్యాచ్ జైపూర్‌ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా జరుగుతుంది.

Related Articles

Latest Articles