తెలంగాణ‌లో వీకెండ్ లాక్‌డౌన్‌? 

తెలంగాణ‌లో వీకెండ్ లాక్‌డౌన్‌? 

తెలంగాణ‌లో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఉన్న‌త స్ధాయి స‌మావేశం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నిర్వ‌హిస్తున్నారు.  ఈ స‌మావేశానికి కీల‌క అధికారులు హాజ‌ర‌య్యారు.  ప్ర‌స్తుతం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మావేశం జ‌రుగుతున్న‌ది.  మే 8 వ తేదీతో నైట్ క‌ర్ఫ్యూ సమ‌యం ముగియ‌నున్న‌ది.  దీనిపై కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌బోతున్నారు.  18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ విష‌యంపై కూడా చ‌ర్చించే అవ‌కాశం ఉంది.  ఇక ఇదిలా ఉంటే, క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, వీకెండ్ లాక్‌డౌన్ వంటివి అమ‌లు చేస్తున్నారు.  ఈరోజు జ‌రుగుతున్న స‌మావేశంలో వీకెండ్ లాక్‌డౌన్ పై చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-