షారుఖ్ కుమారుడికి బెయిల్ వస్తుందా ?

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ అండ్ రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ముంబై క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నందుకు ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సిబి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శనివారం రాత్రి గోవా వెళ్లే క్రూయిజ్ లైనర్‌లో జరిగిన పార్టీలో దాడి చేసి 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

పట్టుబడింది వీరే…
ఎన్సీబీ అధికారులు పక్కా సమాచారంతో ఆస్ట్రియన్ క్రూయిజ్ లైనర్ ‘కార్డెలియా క్రూయిస్’ పై ఆపరేషన్‌ను ప్లాన్ చేశారు. అనుకున్నట్టుగానే క్రూయిజ్ పై దాడి చేసి భారీగా మత్తు పదార్థాలను కనుగొన్నారు. ఈ కేసులో పట్టుబడిన వారిలో ఆర్యన్ ఖాన్, అతని స్నేహితుడు, సినీ నటుడు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, ఇష్మీత్ చద్దా, నూపుర్ సతీజా, మోహక్ జైస్వాల్, గోమిత్ చోప్రా, విక్రాంత్ చోకర్ ఉన్నారు. ఇందులో మున్మున్ ధమేచా మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె అని తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్, సినీ నటుడు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలను కోర్టులో హాజరు పరిచి సోమవారం వరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కస్టడీలో ఉంచారు.

Read Also : ఆర్యన్ అరెస్ట్ తర్వాత షారూఖ్‌ను పరామర్శించిన సల్మాన్

ఎన్సీబీ దాడిలో ఏం దొరికిందంటే ?
ముందస్తు సమాచారం ప్రకారం సినీ ఫక్కీలో అధికారులు వీరిని పట్టుకున్నారు. అనంతరం అరెస్టయిన వారి దగ్గర నుంచి రూ.1.3 లక్షల నగదుతో పాటు 13 గ్రాముల కొకైన్, 22 ఎమ్‌డిఎమ్‌ఎ మాత్రలు, 21 గ్రాముల చరాస్, 5 గ్రాముల మెఫెడ్రోన్‌ను ఎన్‌సిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్థాల చట్టం (NDPS) చట్టం 1985 కింద అమ్మకాలు, కొనుగోలు, డ్రగ్స్ వినియోగంపై అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ సరఫరాదారుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారి వాట్సాప్ చాట్‌లను కూడా ఎన్సీబీ అధికారులు బయటకు తీశారని అంటున్నారు.

ఆర్యన్ కు ఎలాంటి శిక్ష పడుతుంది ?
స్టార్ కిడ్ ఆర్యన్ ఖాన్ కేవలం చరాస్ ను మాత్రమే తీసుకున్నట్లు తేలింది. దీంతో ఆయనపై కేవలం డ్రగ్స్ వినియోగ ఆరోపణలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ నేరానికి శిక్షగా రూ. 20,000 లేదా ఒక సంవత్సరం జైలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది సతీష్ మనేషిండే ఈ రోజు సాధారణ కోర్టులో ఆర్యన్ బెయిల్ కోసం దరఖాస్తు చేస్తానని చెప్పారు.

ఆర్యన్ కు బెయిల్ వస్తుందా ?
ప్రస్తుతం ఆర్యన్ ఎన్సీబీ బృందంతో కోర్టుకు బయలుదేరాడు. ఆదివారం కోర్టు అతడిని ఒకరోజు కస్టడీకి పంపింది. ఈరోజు మళ్లీ ఆర్యన్‌ను కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. కోర్టుకు తీసుకెళ్లే ముందు ఆర్యన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్ళి పరీక్షలు కుడా నిర్వహించారు. అయితే ఎన్‌సిబి రిమాండ్ కోసం అడగడం లేదని, ఈ కారణంగా ఆర్యన్‌కు ఈరోజు బెయిల్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

-Advertisement-షారుఖ్ కుమారుడికి బెయిల్ వస్తుందా ?

Related Articles

Latest Articles