చైతన్యకు సమంత బర్త్ డే విషెస్..?

అక్కినేని నాగ చైతన్య నేడు తన 35 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలందరూ చైతూకి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.. ఇక సినిమాల పరంగా కూడా చై నటించిన, నటిస్తున్న నిర్మాణ సంస్థలు అన్ని హీరో పోస్టర్స్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అభిమానులైతే తమ అభిమాన హీరో బర్త్ డే రోజు కేక్స్ కట్ చేసి మరీ విషెస్ తెలుపుతున్నారు. అయితే వారిలో మాత్రం కొద్దిగా నిరాశ మిగిలి ఉందని చెప్పకనే చెప్తున్నారు. నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకొని విడిపోయారు అనే విషయాన్ని చాలామంది అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది ఇదే రోజు సామ్- చై బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది అలాంటి వేడుకలు లేవు.. కనీసం ట్విట్టర్ వేదికగానైనా సామ్.. చైతూ కి బర్త్ డే విషెస్ తెలిపితే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సామ్.. తన మనసులోని భావాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇక అక్కినేని ఫ్యామిలీ కూడా విడాకుల తరువాత కూడా సామ్ మాకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. సామ్ సైతం నాగార్జున బర్త్ డే కి నాగ్ మామ అని సంబోధిస్తూ బర్త్ డే విషెస్ తెలిపింది. అదే విధంగా ఈరోజు కూడా చైతూ కి సామ్ విషెస్ చెప్తుందా..? లేదా అనేది అభిమానులను తొలుస్తున్న ప్రశ్న.. మేము ఇద్దరం విడిపోయినా ఎప్పటికి స్నేహితులుగానే ఉంటామని చెప్పిన ఈ జంట ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారా..? లేదా అనేది సామ్ ఈరోజు పెట్టె పోస్ట్ ని బట్టి తెలుస్తోందని అంటున్నారు నెటిజన్స్.. మరి సామ్ ఈరోజు చై కి విషెస్ చెప్తుందా..? లేదా అనేది తెలియాలి.

Related Articles

Latest Articles