మ‌రో లేమ‌న్ బ్ర‌ద‌ర్స్‌గా మారుతున్న చైనా ఎవ‌ర్ గ్రాండే… సంక్షోభం త‌ప్ప‌దా?

ప్ర‌పంచంలో అతిపెద్ద దివాలా తీసిన కంపెనీ ఏది అంటే అమెరికాకు చెందిన లేమ‌న్ బ్ర‌ద‌ర్స్ అని చెప్తాం.  ఈ కంపెనీ 2008 లో 600 బిలియ‌న్ డాల‌ర్ల దివాళా తీసింది.  అప్ప‌ట్లో ఈ కంపెనీ దివాళా కార‌ణంగా అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేల‌యింది.  కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది.  అలాంటి సంక్షోభం ఇప్పుడు చైనా నుంచి రాబోతుందా అంటే అవున‌నే అంటున్నారు నిపుణులు.  చైనా జీడీపీలో 29శాతం రియ‌ల్ ఎస్టేట్ నుంచే వ‌స్తుంది.  రియ‌ల్ ఎస్టేట్ రంగంలో చైనాలో అతిపెద్ద సంస్థ‌ల్లో ఒక‌టి ఎవ‌ర్ గ్రాండే.  ఈ కంపెనీ ఇప్పుడు దివాళా తీయ‌బోతున్న‌ది.  ఎవ‌ర్ గ్రాండే కంపెనీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 300 బిలియ‌న్ డాల‌ర్ల‌మేర చెల్లింపులు చెల్లించాల్సి ఉన్న‌ది.  ఈ కంపెనీ 280 న‌గ‌రాల్లో 1300 ప్రాజెక్టుల‌ను చేప‌ట్టింది.  15 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణం చేప‌ట్టాల్సి ఉన్న‌ది.  ఇలాంటి బ‌డా కంపెనీ ఇప్పుడు ఆ సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు జీతాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితికి చేరుకుంది అంటే అర్థం చేసుకొవ‌చ్చు.  ఈ సంస్థ జారీ చేసిన వివిధ బాండ్ల‌పై సెప్టెంబ‌ర్ 23 వ తేదీకి 80 మిలియ‌న్ డాల‌ర్ల వ‌డ్డీని చెల్లించాల్సి ఉన్న‌ది.  అయితే, ఈ వ‌డ్డీని ఇప్ప‌ట్లో చెల్లించ‌లేమ‌ని కంపెనీ ప్ర‌క‌టించ‌డంతో ఇన్వెస్ట‌ర్లు షాక్ అయ్యారు.  క‌రోనా కార‌ణంగా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చైనాలో కుదేల‌యింది.  దీంతో కొట్లాది ప్రాప‌ర్టీలు ఖాళీగా ఉన్నాయి.  కొనేవాళ్లు లేక‌పోవ‌డంతో రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలు ఇబ్బందులు ప‌డుతున్నాయి.  చైనా ప్ర‌భుత్వం ఈ కంపెనీల‌ను ఆదుకోకుంటే ఆ సంక్షోభం ప్ర‌భావం ప్ర‌పంచ‌దేశాల‌పై ప‌డే అవ‌కాశం ఉంటుంది.  

Read: ఆ దేశాధ్య‌క్ష ప‌ద‌వి పోటీలో స్టార్ బాక్సర్‌…

-Advertisement-మ‌రో లేమ‌న్ బ్ర‌ద‌ర్స్‌గా మారుతున్న చైనా ఎవ‌ర్ గ్రాండే... సంక్షోభం త‌ప్ప‌దా?

Related Articles

Latest Articles