బిగ్ బాస్ 5 : వైల్డ్ కార్డు ఎంట్రీ… ఆ ఇద్దరిలో ఒకరు!

“బిగ్ బాస్ 5″లో రచ్చ రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం, మంగళవారం ఎపిసోడ్‌లు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి. ప్రత్యేకించి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిజ స్వరూపాలు నెమ్మదిగా బయట పడుతున్నాయి. ఒక్కొక్కరుగా ముసుగు తొలగిస్తుండడంతో కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం రాజుకుంటోంది. అసభ్యకర కామెంట్స్ కారణంగా నెటిజన్లు ఉమాదేవిపై, పొగరుగా బిహేవ్ చేసినందుకు శ్వేత వర్మపై కూడా ఫైర్ అయ్యారు. శ్వేత వర్మ లోబో ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ని విసిరి అతడిని ఫేక్ అని పిలిచింది. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అనీ పట్ల ఉమా దేవి అగౌరవంగా, అమానవీయంగా ప్రవర్తించినందుకు ఆమెనూ విమర్శించింది. రెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారమే ముగిసినప్పటికీ ఇంకా అదే చర్చనీయాంశం అవుతోంది. నిన్న కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గేమ్ కూడా కొట్టుకోవడానికే అన్నట్టుగా ఆడారు.

Read Also : ట్రెండింగ్ లో “లెహరాయి” లిరికల్ వీడియో సాంగ్

తాజా బజ్ ప్రకారం బిగ్ బాస్ నిర్వాహకులు రాబోయే రెండు వారాల్లో వైల్డ్ కార్డ్‌గా మరో అందమైన మహిళను హౌస్ లోకి పంపడానికి ప్లాన్ చేస్తున్నారు. నవ్య లేదా వర్షిణి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని సమాచారం. ఇంతకుముందు నవ్య బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా ప్రవేశిస్తుందని టాక్ బాగా వినిపించింది. అయితే ఆమె హౌస్ లో అడుగు పెట్టలేదు. దీంతో ఈ సీజన్‌లో నవ్య వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇస్తుందని భావిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం “బిగ్ బాస్ 5” తెలుగు మేకర్స్ యాంకర్ వర్షిణితో కూడా చర్చలు జరుపుతున్నట్లు మరో రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ రూమర్స్ లో నిజం ఎంతుందో తెలియాలంటే వేచి చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-