మెట్రో రైళ్లో అడవిపంది…దర్జాగా తిరుగుతూ…

మెట్రో రైల్లో అప్పుడ‌ప్పుడు మ‌నుషుల‌తో పాటుగా జంతువులు కూడా ప్ర‌యాణం చేస్తుంటాయి.  అనుకోని అతిధుల్లా రైల్లోకి వ‌చ్చి, బోగీల‌న్ని విజిటింగ్ చేస్తు స్టేష‌న్ రాగానే దిగిపోతుంటాయి.  ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌న‌ద‌గ్గ‌ర చాలా రేర్‌గా జ‌రిగినా,  హాంకాంగ్ మెట్రో రైల్లో ఇవి సాధార‌ణ‌మే.  హాంకాంగ్‌లోని క్వారీబే మెట్రోస్టేష‌న్‌లోకి స‌మీపంలోని అడ‌విలోనుంచి ఓ అడ‌వి పంది వ‌చ్చింది.  ట‌క్కెట్ కౌంట‌ర్ సందులో నుంచి లోనికి ప్ర‌వేశించిన ఆ అడవి పంది రైలు ఎక్కేసింది.  బోగీల‌న్నీ ద‌ర్జాగా తిరిగింది.  ఓ సీటు చూసుకొని గమ్మున ప‌డుకొని కునుకు తీసింది.  

Read:బెల్లంకొండ గణేశ్ తో ‘నాంది’ నిర్మాత సినిమా!

ఆ త‌రువాత రైలు దిగి మ‌రో రైలు ఎక్కింది.  రైలు ఎక్కిన త‌రువాత స్టేష‌న్‌కు చేరుకోగానే, అధికారులు దానిని ప‌ట్టుకొని అడ‌విలో వ‌దిలేశారు.  హాంకాంగ్ దేశంలో ద‌ట్ట‌మైన అడ‌వులు అనేకం ఉన్నాయి.  దీంతో అక్క‌డ అడ‌విపందులు అప్పుడ‌ప్పుడు అడ‌విని వ‌దిలి రోడ్డుమీద‌కు వ‌స్తుంటాయి. వీటి వ‌ల‌న ఒక్కోసారి కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది.  అడ‌విపందులు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ వీటికి అక్క‌డి ప్ర‌జ‌లు పెద్ద‌గా హాని క‌లిగించ‌రు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-