రోజుకు నాలుగు సార్లు శృంగారం.. తట్టుకోలేక ఆ భార్య ఏం చేసిందంటే..?

భార్య అంటే కోట్లమందికి పనిమనిషి.. ఇంకొంతమందికి శృంగారానికి మాత్రమే పనికొచ్చే వస్తువు.. అంతే తప్ప ఆమె మనసును అర్ధం చేసుకొనే భర్తలు ఎంతమంది.. రోజు ఇంటి పనులు చేస్తూ అలసిపోయిన ఆమెపై భర్త పెత్తనం చెలాయిస్తే.. శృంగారాన్నికి రావాలని హింసిస్తే.. ఆ బాధలను తట్టుకోలేక ఒక మహిళ.. భర్తను హతమార్చింది. ఈ దారుణ ఘటన సిద్ధిపేట జిల్లాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. విఠలాపూర్ గ్రామంలో ఎల్లయ్య(55) అనే వ్యక్తి భార్య నర్సవ్వ తో కలిసి నివసిస్తున్నాడు. గత కొన్నేళ్ల క్రితం కూతురుకు వివాహం చేసి పంపించడంతో ఎల్లయ్య, భార్యని హింసించడం మొదలుపెట్టాడు. ఎల్లయ్యకు ఈ వయసులోనూ శృంగార కోరికలు ఎక్కువ.. దీంతో భార్యను శృంగారం చేయాలనీ హింసించేవాడు. ఆమెకు ఇష్టంలేకపోయినా భర్త పెట్టె టార్చర్ కి తట్టుకోలేక సరే అనేది. ఇలా నిత్యం భర్త శృంగారం కోసం వేధిస్తుండడం భరించలేకపోయింది. అందులోను ఇటీవల దానికి ఒప్పుకోలేదని ఎల్లయ్య, భార్యను హింసించాడు.. దారుణంగా ఆమె ప్రైవేట్ భాగాలలో కారం కొట్టి చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో ఆ భాదను తట్టుకోలేని నర్సవ్వ ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్తను హతమార్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నర్సవ్వను అరెస్ట్ చేసి విచారించగా భర్త ఆగడాలను వెళ్లగక్కింది. ఆ శాడిస్ట్ భర్త ఆగడాలు విన్న పోలీసులు సైతం అతడిని చంపడంలో ఏ మాత్రం తప్పు లేదని తెలిపారు. కానీ హత్య చేయడం నేరం కాబట్టి ఆమెను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కి తరలించారు.

Related Articles

Latest Articles