అమెరికా కంపెనీలు ఇండియాలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి?

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెల్సినవాడే నిజమైన వ్యాపారి అనిపించుకుంటాడు. ఈ ఫార్మూలా భారత ఆటో మొబైల్ రంగానికి అచ్చుగుద్దునట్లు సరిపోతుంది. దీనిని అక్షరాల ఎవరైతే ఫాలో అవుతారో ఆ కంపెనీలు స్వదేశమైన, విదేశామైన భారత్ లో సక్సస్ కావాల్సిందే. ఇప్పటికే భారత్ నాడిని జపనీస్.. కొరియన్లు పసిగట్టి విజయవంతం కాగా అమెరికా మాత్రం వెనుకబడిపోతుంది. దీంతో వరుసబెట్టి అమెరికన్ కంపెనీలు భారత్ నుంచి పెట్టాబేడా సర్దుకొని పోలో మంటూ తిరుగుముఖం పడుతున్నాయి.

గడిచిన ఐదేళ్లలో భారత్ ఆటో మొబైల్ రంగం జెడ్ స్పీడుతో దూసుకెళుతోంది. రాబోయే రోజుల్లోనూ ఇక్కడ ఆటోమొబైల్ రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతో చాలా విదేశీ కంపెనీలు భారత్ లో తమ బ్రాండ్ కార్లను పరిచయం చేస్తున్నాయి. వీటిలో సౌత్ కొరియన్, జపనీస్ కంపెనీలు భారత్ లో సత్తాచాటుతుండటం అమెరికా మాత్రం వెనుకబడి పోతుండటం ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే అమెరికన్ కంపెనీలు ఎంచుకున్న వ్యూహామే ఇందుకు ప్రధాన లోపమని మార్కెట్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు.

అమెరికాతో పోలిస్తే భారత్ చాలా విభిన్నం. ఇక్కడి పట్టణ ప్రజలకు, గ్రామీణ ప్రజలకు వేర్వేరుగా అవసరాలు ఉంటాయి. భారత్ లో అత్యధికంగా ఉన్న మధ్యతరగతి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కార్లను తయారుచేస్తేనే ఆ కంపెనీ విజయం సాధిస్తుంది. భారత్ లో 2018 నాటికి ప్రతీ వెయ్యి మందిలో కేవలం 22మందికి మాత్రమే కార్లు ఉన్నట్లు నీతి అయోగ్ చీఫ్ అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. అదే అమెరికాలో అయితే ప్రతీ వెయ్యి మందిలో 980మందికి సొంత కార్లు ఉన్నాయి.

ఇక 2040 నాటికి భారత్ లో సొంత కార్లు ఉన్నవారి సంఖ్య ప్రతీ వెయ్యి మందిలో 175కు చేరుకుంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేస్తోంది. ఈ లెక్కన 130కోట్ల జనాభా ఉన్న భారత్ దేశంలో రాబోయే రోజుల్లో కార్ల కొనుగోళ్లు ఓ రేంజులో ఉంటుందని తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న కార్లకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. వారి అవసరాలను గుర్తించి ఎవరైతే కార్లను తయారు చేస్తారో వాటినే కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతుంటారు.

జపాన్ కు చెందిన సుజుకీ, దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్, దాని అనుబంధ సంస్థ కియా కంపెనీలు ఇప్పటికే భారతీయుల నాడిని పట్టాయి. ఈ కంపెనీలు భారత్ ఆటో మొబైల్ రంగంలో దూకుడును చూపిస్తున్నాయి. కొత్త కొత్త మోడల్స్, ఫీచర్లతో ఆకట్టుకుంటూ కార్ల కొనుగోళ్లను పెంచుకుంటున్నాయి.

మరోవైపు అమెరికా మాత్రం భారతీయుల టేస్టుకు తగ్గట్టుగా కార్లను తయారు చేయడం లేదని తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజల అవసరాలను అనుగుణంగా అమెరికన్ కంపెనీలు కార్లను తయారు చేయకపోవడంతో వాటి సేల్స్ ప్రతియేటా దారుణంగా పడిపోతున్నాయి. దీంతో గడిచిన ఐదేళ్లలో ఫోర్డ్ తోపాటు ఆరు కంపెనీలు భారత్ ను వీడినట్లు తెలుస్తోంది. వీటిల్లో జనరల్ మోటార్స్, ఫోర్డ్, హార్లీడెవిడ్సన్, యూఎం మోటార్ సైకిల్స్ ఉన్నాయి. ఇవన్నీ అమెరికా కంపెనీలు కావడం విశేషం.

దక్షిణ కొరియాకు చెందిన కియా వంటి కంపెనీలు భారత్ లో కొత్త షోరూంలు ఏర్పాటు చేస్తూ ముందుకెళుతున్నాయి. అమెరికాకు చెందిన ఫోర్డ్ మాత్రం తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. దీనికి కరోనా ప్రభావం కూడా కొంత తోడైనట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా కరోనా వల్ల ఆటో మొబైల్ రంగం ఆశించిన రీతిలో వృద్ధి చెందడం లేదని తెలుస్తోంది. ఏదిఏమైనా కొరియన్, జపాన్ కంపెనీలు భారత్ లో జెట్ స్పీడుతో దూసుకెళుతుండగా.. అమెరికా కంపెనీలు మాత్రం భారతీయుల పల్స్ పట్టుకోలేక చతికిలబడుతున్నాయి.

Related Articles

Latest Articles

-Advertisement-