చిరు, జగన్ భేటీకి నాగార్జున ఎందుకు వెళ్ళలేదు ?

టాలీవుడ్ సమస్యలకు సంబంధించి సీఎం జగన్ తో భేటీకి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. స్వయంగా సీఎం ఆహ్వానం మేరకే సినిమా బిడ్డగా భేటీకి వచ్చానంటూ చిరంజీవి చెప్పారు. అయితే సీఎం జగన్, చిరంజీవి ఈ లంచ్ భేటీలో అసలేం చర్చించబోతున్నారు ? చాలా రోజులుగా సమస్యలతో సతమతమవుతున్న టాలీవుడ్ కు ఈ భేటీతో ఊరట లభిస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. కొద్దిసేపటి క్రితం బేగంపేట నుంచి చార్టర్డ్ ఫ్లైట్‌లో విజయవాడకు బయలుదేరిన చిరంజీవి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాక మీడియాకు కన్పించారు. తాజాగా ఏపీ సీఎం జగన్ నివాసానికి చేరుకున్న చిరంజీవి ఈ లంచ్ భేటీలో సినిమా సమస్యలపై, ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ టిక్కెట్ ధర కారణంగా తెలుగు సినిమా ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించనున్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. అయితే ఈ భేటీకి నాగార్జున ఎందుకు హాజరు కాలేదు ?

Read Also : లైవ్ : ఏపీ సీఎంతో చిరంజీవి భేటీ

ఇటీవల “బంగార్రాజు” ఈవెంట్ లో తమ సినిమాకు టికెట్ ధరల సమస్య లేదని చెప్పి నాగార్జున విమర్శలకు గురయ్యారు. ఆ తరువాత నాగ చైతన్య కూడా ఇదే విధంగా రియాక్ట్ అయ్యారు. నటులుగా తమకు ఈ విషయం గురించి ఆందోళన లేదని, అది నిర్మాతలు చూసుకుంటారని చెప్పారు. ఇండస్ట్రీ మొత్తం సినిమా టికెట్ ధరల గురించి ఘాటుగా స్పందిస్తుంటే అక్కినేని హీరోలు మాత్రం పర్లేదు అన్నట్టుగా ఉండడం టాలీవుడ్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఇదిలా ఉండగా… తాజాగా చిరు, జగన్ భేటీపై నాగార్జున స్పందించారు.

Read Also : ‘రౌడీ బాయ్’తో లిప్ లాక్ పై మీమ్స్… అనుపమ రియాక్షన్

“అందరి కోసమే చిరంజీవి సీఎం దగ్గరికి వెళ్లారు. జగన్ కు చిరంజీవి అంటే ఇష్టం… ఇండస్ట్రీ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి” అని అన్నారు. ఇక సినిమా టికెట్ల విషయంలో తాను చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుతూ ‘టికెట్లపై నా సినిమా వరకే మాట్లాడాను’ అని వివరణ ఇచ్చారు. ఇక ఈ మీటింగ్ తాను ఎందుకు హాజరు కాలేదు అన్న విషయాన్ని కూడా నాగార్జున ఈ సందర్భంగా స్పష్టం చేశారు. “బంగార్రాజు” ఫంక్షన్ ఉండటం వల్ల నాగార్జున అక్కడికి వెళ్లలేకపోయారట. కాగా చిరంజీవి, జగన్ భేటీ తరువాత సినిమా సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తోంది టాలీవుడ్. ప్రస్తుతం వీరి మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related Articles

Latest Articles