మండలి ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ ఎంపికపై ఉత్కంఠ

తెలంగాణ శాసన మండలిలో 12 మంది ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసింది. వీరిలో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఉండడంతో… కొత్త ప్రొటెం చైర్మన్ కు కసరత్తు పూర్తయింది. కొత్త ప్రొటెం చైర్మన్ గా రాజేశ్వర్ రావు నియామకం కానున్నారు. తెలంగాణ శాసన మండలిలో12 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. ఇందులో కొద్ది మంది తిరిగి శాసన మండలికి ఎన్నికయ్యారు. మొత్తం 12 మంది శాసన మండలి సభ్యులు ఈ నెల 12 న ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ఇటు ఎమ్మెల్సీగా పదవీ కాలం ముగిసిన వారిలో ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి ఉండడంతో …ఆ స్థానంలో కొత్త వారి నియామకానికి పేరు ఖరారయినట్టు తెలుస్తోంది.

చైర్మన్ ప్రొటెంగా సీనియర్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు పేరు ఖరారయినట్టు సమాచారం. ఈమేరకు ప్రొటెం ఛైర్మన్ నియామకంపై ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇక మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక బడ్జెట్ సమావేశాల్లో ఉండే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. శాసన మండలి చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎవరికి అవకాశం ఇవ్వాలన్న అంశంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఒక ఆలోచనకు వచ్చినట్టు టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటు శాసన మండలిలో ఖాళీగా ఉన్న చీఫ్ విప్ తో పాటు విప్ పదవులపై పలువురు ఎమ్మెల్సీలు ఆశలు పెట్టుకున్నారు.

Related Articles

Latest Articles