భారత్‌లో వ్యాక్సినేషన్‌.. డబ్ల్యూహెచ్‌వో అభినందనలు..

కరోనా మహమ్మారి కట్టడికోసం ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్‌.. ప్రపంచదేశాలతో పాటు.. భారత్‌లో కూడా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ఇప్పటికే దేశ్యాప్తంగా 62.29 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసింది భారత్.. ఇక, శుక్రవారం ఒకేరోజు కోటి డోసులు వేసి.. మరో అరుదైన ఘనత సాధించారు.. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందనలు తెలిపింది.. భారత్‌లో ఒకేరోజు కోటి మందికి వ్యాక్సినేషన్‌పై సంతోషాన్ని వ్యక్తం చేశారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్ సౌమ్యాస్వామినాథన్‌.. సోషల్‌ మీడియా వేదికగా భారత ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ‘జనాభాలో 50 శాతం మందికి భారత్‌ టీకా (కనీసం ఒక మోతాదు) ఇచ్చింది.. ఇప్పటివరకు మొత్తం 62 కోట్ల డోస్‌లు ఇచ్చారు.. అందులో శుక్రవారం కోటి డోస్‌లు ఇవ్వడం నిజంగా అభినందనీయం అన్నారు.. ఇక, ఈ ప్రచారంలో పాల్గొన్న వెయ్యి మందికి పైగా కార్యకర్తలకు అభినందనలు తెలిపిన డాక్టర్ సౌమ్యా స్వామి నాథన్‌… వ్యాక్సిన్‌తో కరోనా నుంచి ప్రజారోగ్యం, నివారణ పద్ధతులను అనుసరించడం ద్వారా మనమందరం సురక్షితంగా ఉందాం అంటూ ట్వీట్ చేశారు.

-Advertisement-భారత్‌లో వ్యాక్సినేషన్‌.. డబ్ల్యూహెచ్‌వో అభినందనలు..

Related Articles

Latest Articles