కోవిడ్‌ చికిత్స.. మరో 2 ఔషధాలకు డబ్ల్యూహెచ్‌వో గ్రీన్‌ సిగ్నల్‌

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది.. దానికి చెక్‌ పెట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. ఇదే సమయంలో మరికొన్ని ఔషధాలకు కూడా ఆమోదం తెలింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)… కోవిడ్‌ రోగులకు చికిత్స అందించడానికి తాజాగా మరో రెండు ఔషధాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రుమటైడ్‌ కీళ్ల నొప్పుల నివారణకు ఎలి లిల్లీ కంపెనీ తయారు చేసిన మెడిసిన్, గ్లాక్సోస్మిత్‌క్లేన్‌ కంపెనీ మోనో క్లోనల్‌ యాంటీబాడీ థెరపీలను కోవిడ్‌ రోగులకు ఇవ్వడానికి డబ్ల్యూహెచ్‌వో నిపుణులు ఆమోదం తెలిపారు.. కోవిడ్‌ రోగులకు చికిత్సలో ఇవి కీలకంగా పనిచేస్తాయని ఇప్పటికే జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి..

Read Also: జ‌న‌వ‌రి 15, శనివారం దిన‌ఫ‌లాలు…

ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ఆమోదం తెలిపిన లిల్లీ కంపెనీకి చెందిన బారిక్టినిబ్‌ ఔషధం కరోనా తీవ్రంగా సోకినవారి ప్రాణాలు కాపాడుతుందని పేర్కొంది.. అంతే కాదు.. బాధితులకు వెంటిలేటర్‌ అవసరం లేకుండా చేస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది డబ్ల్యూహెచ్‌వో.. స్టెరాయిడ్స్‌తో పాటు కీళ్ల నొప్పులకు వాడే ఈ ఔషధాన్ని ఇస్తే మంచి ఫలితాలు వస్తున్నాయని స్పష్టం చేసింది.. ఇప్పటికే ఈ ఔషధాన్ని యూఎస్, యూరప్‌లలో 2021 మే నెల నుంచి అత్యవసర సమయాల్లో వినియోగిస్తున్నారని.. కోవిడ్‌తో ఇబ్బంది పడుతూ ఆస్పత్రిలో చేరే అవసరం ఉన్న వారికి గ్లాక్సో కంపెనీకి చెందిన మోనోకల్నల్‌ యాంటీబాడీ ట్రీట్‌మెంట్‌ ఇవ్వొచ్చని పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరోవైపు, డబ్ల్యూహెచ్‌వో ఆమోదం లభించకుండానే.. మరికొన్ని దేశాల్లో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు, వివిధ ఔషధాలను కూడా వినియోగిస్తున్నారు.

Related Articles

Latest Articles