ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలు ఇవే!

ప్రస్తుతం థియేటర్లతో సమానంగానే ఓటీటీలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.. కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లో మునుపటి జోష్ కనిపిస్తోంది. పెద్ద సినిమాలు లేకున్నాను, చిన్న సినిమాలు సైతం భారీ కలెక్షన్స్ రాబట్టుకొంటున్నాయి. ఇక ఈ వారం థియేటర్లోనూ, ఓటీటీలోను విడుదల అవుతున్న సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి.

సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ అక్టోబర్ 1న విడుదల అవుతుంది. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ తో పాటుగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమాకు మంచి బచ్ ఏర్పడింది. సాయిధరమ్ సరసన ఐశ్వర్యరాజేష్ హీరోయిన్ గా నటించింది.

చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ నుంచి వస్తున్న చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’.. జీవీ ప్రకాశ్‌కుమార్‌ కీలక పాత్రలో నటించారు. ఈ యాక్షన్ డ్రామా తమిళంలో 2019 సెప్టెంబర్ 6న విడుదలైంది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత దీనిని ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో తెలుగులో డబ్ చేసి ఈ యేడాది ఆగస్ట్ 13న థియేటర్లలో విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 1 నుండి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

గురు పవన్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఇదే మా కథ’.. విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్‌ రైడర్ల కథ ఇది. శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, భూమిక, తాన్యా హోప్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అక్టోబర్‌ 2న థియేటర్స్‌లో విడుదల కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ లో.. అక్టోబర్‌ 1న ‘డయానా’, అక్టోబరు 1న ‘ద గల్టీ’. సెప్టెంబరు 29న ‘నో వన్‌ గెట్స్‌ అవుట్‌ ఎలైవ్‌’..

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో.. అక్టోబరు 1న ‘షిద్ధత్‌’, అక్టోబరు 1న ‘లిఫ్ట్‌’,

అమెజాన్‌ ప్రైమ్‌ లో.. సెప్టెంబరు 30న ‘చెహ్రే’, అక్టోబరు 1న బింగ్‌ హెల్‌’, అక్టోబరు 1న ‘బ్లాక్‌ ఆజ్‌ నైట్‌’..

జీ5 లో.. అక్టోబరు 1న ‘బ్రేక్‌ పాయింట్‌’ సినిమాలు విడుదల కానున్నాయి.

-Advertisement-ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలు ఇవే!

Related Articles

Latest Articles