సమంత ఎక్కడ?

సిబ్బందికి సెలవులు… ప్రశాంతత కోసం ఒంటరి ప్రయాణం..!
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎక్కడ ఉంది. విడాకుల న్యూస్ బయటకు వచ్చిన తర్వాత సమంతకు ప్రశాంతత కరువయిందా!? పీస్ కోసం ఎక్కడకి వెళ్ళింది. అసలు ఎవరితోనూ టచ్ లో లేదా!? ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్.

పర్సనల్ స్టాప్ కి సెలవు!
ఇటీవల కింగ్ నాగ్ బర్త్ డే సందర్భంగా సమంత చేసిన ట్వీట్ తో విడాకుల మాట రూమర్ అని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత సమంత ఓ ఇంటర్వ్యూలో రూమర్స్ కి సమాధానం చెప్పవలసిన అవసరం లేదని, తనకు చెప్పాలని అనిపించినపుడే చెబుతానని స్పష్టం చేయటంతో మళ్ళీ సందేహం ఏర్పడింది. ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ కి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం నాగ చైతన్య, సమంత మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. సమంత కిట్టీలో ఒక తమిళ సినిమా తప్ప వేరే ఏమీ కమిట్ అవలేదు. గుణశేఖర్ ‘శాకుంతలం’ కూడా పూర్తి చేసింది. అంతే కాదు తన పర్సనల్ స్టాఫ్ కి నాలుగు నెలల పాటు సెలవులు ఇచ్చిందట. ప్రస్తుతం సామ్ ఎక్కడ ఉందనే విషయం కూడా తెలియటం లేదు. ముంబై, గోవా, చెన్నైలో ఎక్కడకు వెళ్ళిందనేది సస్పెన్స్. ఫిట్నెస్ ట్రైనర్ శిల్పారెడ్డి, పర్సనల్ డాక్టర్ మంజులా అనగాని తో మాత్రమే సమంత టచ్ లో ఉన్నట్లు సమాచారం.

ముంబై షిష్టింగ్ గొడవలకు కారణమా!?
‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంతకు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. దాంతో సమంతకు ముంబై షిఫ్ట్ అవ్వాలనే కోరిక కలిగిందట. ఇదే చైతూ, సామ్ కాపురంలో చిచ్చు పెట్టిందంటున్నారు. ఇద్దరి కుటుంబ సభ్యులు ప్యాచ్ అప్ కోసం చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదట. తన సోషల్ మీడియాలో అక్కినేని పేరు తొలిగించటం నుంచి సిబ్బందికి సెలవులు ఇచ్చి సమంత ఏకాంతంలోకి వెళ్ళడం వరకూ మొత్తం వ్యవహారం గమనిస్తే ఇక చైతన్య, సమంత మధ్య ప్యాచ్ అప్ కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అటు అక్కినేని వంశాభిమానులతో పాటు సమంత ఫ్యాన్స్ కూడా వివాదాలు సమసి ఇద్దరూ ఒక్కటిగా ఉండాలని కోరుకుంటున్నారు. లెట్స్ హోప్ సో..

Related Articles

Latest Articles

-Advertisement-