టీకా వేయించుకుని విదేశాలకు బయలుదేరుతోన్న హాలీవుడ్ సినిమాలు!

కరోనా వ్యాధి సోకటం ప్రమాదకరం. ఇక వచ్చి తగ్గిపోయినప్పటికీ… పూర్తిగా కోలుకోవటం కొంచెం కష్టమే! అయితే, ఇదంతా మనుషులకే కాదు చాలా రంగాలకి కూడా వర్తిస్తుంది. ఉదాహరణకి సినిమా రంగమే తీసుకుంటే, కరోనాతో విపరీతంగా మంచం పట్టింది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీనే! అయితే, పాశ్చాత్య దేశాల్లో వైరస్ దెబ్బ నుంచీ ఇప్పుడిప్పుడే బాక్సాఫీస్ కోలుకుంటోంది. కానీ, అదంతా ఈజీగా జరగటం లేదు…

మన దేశంలో ఇంకా థియేటర్లు మూతపడే ఉన్నా అమెరికా, యూరప్ లో పరిస్థితి సద్దుమణుగుతోంది. ప్రతీ వారం కొత్త చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు ‘జాన్ విక్ : చాప్టర్ 4’ అనే క్రేజీ సీక్వెల్ మూవీ కొత్త అంకానికి తెర తీస్తోంది! ‘జాన్ విక్’ ఫ్రాంఛైజ్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉన్న సినిమా సిరీస్. అందులో 4వ భాగంగా రాబోతోన్న లెటెస్ట్ ఇన్ స్టాల్మెంట్ ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో షూటింగ్ జరుపుకోనుందట! పైగా ఔట్ డోర్ పిక్చరైజేషన్ కూడా చేస్తారట. ప్యారిస్ నగరంలో తీసే సన్నివేశాలు యాక్షన్ తో అలరిస్తూ ‘జాన్ విక్ : చాప్టర్ 4’కు హైలైట్ గా నిలుస్తాయట!

ఒక హాలీవుడ్ సినిమా ఎంతో కీలకమైన సీన్స్ ను యూరప్ లో షూట్ చేయటం ప్యాండమిక్ కాలంలో ఇదే తొలిసారి. అదీ ప్యారిస్ వీధుల్లో నిర్భయంగా నటీనటులు కెమెరా ముందుకు రావటం పెద్ద ముందడుగు అనే చెప్పాలి. అమెరికాలోనూ, యూరప్ లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో ఇది సాధ్యం అవుతోందంటున్నారు ఫిల్మ్ మేకర్స్! అంతే కాదు, ‘జాన్ విక్ 4’ ప్యారిస్ షెడ్యూల్ తరువాత న్యూ యార్క్, జపాన్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట! మహమ్మారి ప్రబలిన తరువాత ఇలా దేశదేశాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రం ‘జాన్ విక్’ తప్ప మరొకటి లేదు. అందుకే, ఈ సినిమా హాలీవుడ్ కు సరికొత్త ఉత్సాహం కలిగించనుందని విశ్లేషకులు అంటున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-