జాన్ అబ్రహాం చేసిన పనికి కత్రీనా ఏడ్చింది! అప్పుడు సల్మాన్ ఏమన్నాడంటే…

ఇక్కడ పుట్టి పెరిగిన చాలా మందికే సినిమా ప్రపంచంలో విజయం దక్కటం చాలా కష్టం. కానీ, భాష రాకున్నా, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన లేకున్నా లండన్ బ్యూటీ కత్రీనా ముంబైలో బిగ్ స్టార్ గా ఎదిగింది. కానీ, అదంతా అంత తేలిగ్గా జరిగిన పని కాదు. క్యాట్ ఎర్టీ డేస్ లో చాలా ఇబ్బందులు పడింది. ఓసారి జాన్ అబ్రహాం వల్ల ఏడ్చేసిందట కూడా!
కత్రీనా చేత కంటనీరు పెట్టించేలా జాన్ ఏం చేశాడంటే ‘సాయా’ అనే సినిమాలో ఆమెతో కలసి నటించనని చెప్పాడట. అందుక్కారణం బ్రిటన్ బ్యూటీకి అప్పట్లో హిందీ కొంచెం కూడా రాకపోవటమే. జాన్ నిర్ణయం కరెక్టే అయినా ఆఫర్ పోవటంతో అవమానంగా భావించిన కత్రీనా కన్నీళ్లు పెట్టుకుందట. అప్పుడు సల్మాన్ ఏం చెప్పాడో తెలుసా? ‘’ఏడవటం ఎందుకు… ఇంకా పట్టుదలగా ప్రయత్నం చేసి పెద్ద సక్సెస్ సాధించు! ఏదో ఒక రోజు నువ్వు జాన్ అబ్రహాంతో నటించనని రిజెక్ట్ చేసే స్థాయికి చేరుకో! కానీ, ఛాన్స్ వస్తే తిరస్కరించకు… అతడితో సినిమా చెయ్!’’అన్నాడట!
సల్మాన్ ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ తో కత్రీనా నిజంగానే హిందీ నేర్చుకుని, హిందీ సినిమా రంగంలో అగ్ర తారగా ఎదిగింది. కాల క్రమంలో ‘న్యూ యార్క్’ సినిమాలో కత్రీనాతోనే జాన్ అబ్రహాం కలసి నటించాడట కూడా! అఫ్ కోర్స్, మొదట్లో క్యాట్ ని జాన్ రిజెక్ట్ చేయటానికి కారణం ఆమెకు హిందీ రాకపోవటం ఒక్కటే కారణం కాదంటారు కొందరు! సల్మాన్ తో జాన్ అబ్రహాంకు ఎన్నో ఏళ్లుగా పడదు. వారిద్దరి మధ్య ఓసారి జరిగిన గొడవే కారణం. అందుకే, సల్మాన్ గాళ్ ఫ్రెండ్ గా ప్రచారం అయిన కత్రీనా కైఫ్ ని ఎర్టీ డేస్ లో జాన్ రిజెక్ట్ చేశాడంటారు!
జాన్ అబ్రహాం ఎందుకు మొదట వద్దన్నాడు, తరువాత ముద్దన్నాడు అన్నది మనకు తెలిసే విషయం కాదు! కానీ, సల్మాన్ ఇచ్చిన ఎంకరేజ్ మెంట్, కత్రీనా చేసిన కృషీ రెండూ తప్పకుండా మెచ్చుకోవాల్సినవే! ఏమంటారు?

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-