What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

★ నేడు ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం జగన్ చర్చలు… తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
★ చిత్తూరు జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన.. కుప్పం మండలం దేవరాజపురం నుంచి పర్యటించనున్న చంద్రబాబు.. నేడు రామకుప్పం మండలంలో చంద్రబాబు రోడ్ షో
★ అమరావతి రాజధాని నగరపాలక సంస్థ ఏర్పాటుపై నేడు రెండో రోజు గ్రామసభలు… నేడు కృష్ణాయపాలెం, వెంకటపాలెం, లింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెంలో గ్రామసభలు
★ పశ్చిమగోదావరి జిల్లాలో నేటి నుంచి అంతర్జాతీయ తెలుగు సంబరాలు.. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు సంబరాలు.. పెద్దఅమిరంలో మూడురోజుల పాటు తెలుగు సంబరాలు…నేడు పూర్ణకుంభ పురస్కారాల ప్రదానోత్సవ సభతో వేడుకలకు శ్రీకారం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు.. వేడుకలకు హాజరుకానున్న మంత్రులు పేర్ని నాని, శ్రీరంగనాథరాజు
★ నేడు విశాఖ ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చిన ఆదివాసీ సంఘాలు.. జీవో 3 పునరుద్ధరణతో సహా ఆదివాసీ సంఘాల పలు డిమాండ్లు
★ తమిళనాడులో నేటి నుంచి నైట్ లాక్‌డౌన్ అమలు… రాత్రి 10 గంటల నుంచి ఉ.5 గంటల వరకు లాక్‌డౌన్.. తమిళనాడులో ప్రతి ఆదివారం పూర్తి లాక్‌డౌన్

Related Articles

Latest Articles