బుట్టబొమ్మకు ఆ స్టార్ హీరోలా ఉండాలన్పిస్తోందట…!

బుట్టబొమ్మ పూజాహెగ్డే దక్షినాదితో పాటు ఉత్తరాదిలో కూడా దూసుకెళ్తోంది. ప్రస్తుతం పూజాహెగ్డే చేతిలో భారీ ఆఫర్లే ఉన్నాయి. యంగ్ రెబల్ స్టార్ సరసన “రాధేశ్యామ్”లో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బీటౌన్ లో రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న “సర్కస్” చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా తన సహనటుడు రణబీర్ గురించి మాట్లాడుతూ తన శక్తిని అరువుగా తీసుకోవాలనుకుంటున్నాను అని అన్నారు పూజ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజాహెగ్డే మాట్లాడుతూ “నేను రణ్‌వీర్ ఏదైనా తీసుకోవాలనుకుంటే… నేను అతని ఎనర్జీని, పరిశీలనా శక్తిని అప్పుగా తీసుకుంటాను. అతను చాలా షార్ప్… దేనినీ మిస్ అవ్వడు. నేను ఇంట్రోవర్ట్… రణ్‌వీర్ నాకు పూర్తిగా వ్యతిరేకం. కొన్నిసార్లు నేను అతనిలాగే ఉండాలని కోరుకుంటున్నాను… ఎనర్జిటిక్, ఫ్యాబులస్ టాకర్. ఆయన సెన్స్ అఫ్ హ్యూమర్ అద్భుతం” అంటూ తన మనసులోని మాటను చెప్పేసింది. “సర్కస్” షూటింగ్ తనకు మంచి ఎక్స్పీరియన్స్ అని పేర్కొంది. షేక్స్పియర్ “కామెడీ ఆఫ్ ఎర్రర్స్” స్పూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2022లో ఈ చిత్రం విడుదల కావచ్చు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-