చంద్రబాబు కంటతడి పెట్టడానికి కారణం ఇదేనా?

ఏపీ అసెంబ్లీ శుక్రవారం రణరంగంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ముఖ్యంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా చంద్రబాబుపై మాటల యుద్ధం చేశారు. అసెంబ్లీలో వ్యవసాయ చట్టాలపై చర్చ నడుస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గురించి వైసీపీ ఎమ్మెల్యేలు అసభ్యకరంగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చంద్రబాబు కంటతడి పెట్టడానికి కారణం ఇదేనా?

Read Also: వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన పురంధేశ్వరి

‘లోకేష్ ఎలా పుట్టాడో తెలుసా’ అని ఓ ఎమ్మెల్యే నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఆ వీడియోలో వినిపిస్తోంది. వెంటనే జోక్యం చేసుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం ‘ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి.. ఆగండి’ అని వారించారు. అనంతరం మంత్రి కొడాలి నాని కూడా తన నోటికి పనిచెప్పారు. ఆ లోకేష్ గాడు ఎలా పుట్టాడో వాడికే తెలియదు అంటూ ఆరోపించారు. వీళ్లిద్దరి వ్యాఖ్యలకు చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని… తన కుటుంబం గురించి మాట్లాడటంపై కలత చెంది అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ వీడియోలో ఎంత నిజముందో తెలియదు. అసెంబ్లీలో జరిగిన ఈ సంభాషణపై స్పీకర్ ఫుటేజ్ విడుదల చేస్తే కానీ అసలు నిజాలు బహిర్గతం కానున్నాయి.

చంద్రబాబు కంటతడి పెట్టడానికి కారణం ఇదేనా?

Related Articles

Latest Articles