అసలు నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య ఏం జరుగుతోంది?

అసలు నందమూరి, మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది ?… ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మధ్య ఇదే ప్రశ్న మెదులుతోంది. గతంలో నందమూరి, మెగా ఫ్యామిలీలు పెద్దగా కలిసిన సందర్భాలు లేవు. ముఖ్యంగా సినిమా ఈవెంట్లలో… అందుకే ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న పరిణాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

బాలయ్య వేడుకకు అతిథిగా మెగా హీరో !
నటసింహం నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. ఇక ఇందులో బాలయ్య అఘోరా కన్పించడం, దానికి సంబంధించి ‘రోర్ ఆఫ్ అఖండ’ అంటూ విడుదలైన టీజర్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించింది. భారీ అంచనాలతో డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ మేరకు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ 27న శిల్ప‌క‌ళా వేదిక‌లో అట్ట‌హాసంగా జరపబోతున్నట్టుగా మేకర్స్ నిన్న ప్రకటించారు. అయితే ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ రానుండడం గమనార్హం.

అల్లు అర్జున్ ఎందుకు ?
‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ అతిథిగా ఎందుకు వస్తున్నాడు? అనే చర్చ నడుస్తోంది టాలీవుడ్ లో. ఈ పని వెనుక ఉన్న కీలక సూత్రధారి అల్లు అర్జున్ అని చెప్పుకుంటున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. అల్లు అరవింద్ ఓటిటి ‘ఆహా’లో ప్రసారం అవుతున్న పాపులర్ టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’కు బాలయ్య హోస్టుగా చేస్తున్నాడు. అలాగే బన్నీకి, ‘అఖండ’ దర్శకుడు బోయపాటికి కూడా మంచి అనుబంధమే ఉంది. గతంలో అల్లు అర్జున్ కు బోయపాటి ‘సరైనోడు’ వంటి హిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలా అల్లు, నందమూరి ఫ్యామిలీల మధ్య బోయపాటి వారధిగా నిలిచారన్న మాట. ఈ కారణంగానే ‘అఖండ’ వేడుకకు ముఖ్య అతిథిగా బన్నీని ఆహ్వానించడానికి, అల్లు అర్జున్ సైతం ఈ వేడుకకు హాజరు కావడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. మొత్తానికి అల్లు, నందమూరి ఫ్యామిలీల మధ్య మంచి స్నేహం ఉండడం తెలుగు ప్రేక్షకులకు కనువిందుగా మారింది. లెజెండరీ నటులు అల్లు రామలింగయ్య, ఎన్టీఆర్ కాలం నుంచే ఈ రెండు కుటుంబాల మధ్య స్నేహబంధం ఉందని ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ షో ప్రారంభోత్సవంలో బాలయ్య స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

Read Also : మరోసారి ఫ్యాన్స్ కు సామ్ షాక్… దీని కోసమే ఇదంతా చేసిందా ?

నందమూరి వర్సెస్ మెగా ఫ్యామిలీ
ఇదంతా బాగానే ఉంది కానీ అసలు నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య ఏం జరుగుతోంది ? ఇంతకుముందు, ఇప్పుడు కూడా నందమూరి, మెగా ఫ్యామిలీలకు పడదు అనే టాక్ ఉంది ఇండస్ట్రీలో. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇందుకు ఉదాహరణ. ఒకప్పుడు మెగా, నందమూరి అభిమానులు ఒకరినొకరు కొట్టుకోవడం, చంపుకోవడం దాకా వెళ్లారన్న విషయం జగమెరిగిన సత్యం. ఇటీవల కాలంలో కూడా సినిమా సమస్యల విషయంలో కూడా చిరంజీవితో కలిసి పెద్దలు అందరూ టీఎస్ ప్రభుత్వాన్ని కలవడానికి వెళ్లారు. బాలకృష్ణకు మాట మాత్రమైనా చెప్పలేదు. ఏ విషయంపై బాలయ్య కూడా బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక రీసెంట్ గా జరిగిన ‘మా’ ఎన్నికల్లో సైతం చిరంజీవి ఒకరికి, బాలయ్య ఒకరికి సపోర్ట్ చేశారు. వీరిద్దరికీ మధ్య సఖ్యత లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య ఏం జరుగుతోంది ?
మరి ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ ఓ షోను నిర్వహించడం, దానికి బాలయ్య హోస్టుగా మారడం, మోహన్ బాబు అతిథిగా విచ్చేయడమే షాకింగ్ అంటే… ఇప్పుడు ఏకంగా బాలయ్య సినిమాకు అతిథిగా బన్నీ రావడం అనేది విచిత్రమే మరి. మెగా కాంపౌండ్ లో అంతమంది స్టార్ హీరోలు ఉన్నా అరవింద్ బాలయ్య వైపు మొగ్గు చూపారు. బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా రేసులో ఉండడంతో ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆహ్వానం అందుకొని ఉండొచ్చు. అల్లు అర్జున్ రాకతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ మరో ప్రశ్న బాలయ్యకు టాలీవుడ్ లో తిరుగులేదు. మరి ఆయన సినిమాకు బన్నీ అతిథిగా… ఆయన కూడా మెగా కాంపౌండ్ నటుడే కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

Related Articles

Latest Articles