కొరియాలో మ‌రో స‌స్పెన్స్‌: ఆ మూడు రోజుల్లో ఏం జ‌రిగింది?

ఉత్త‌ర కొరియాలో అధ్య‌క్షుడు కిమ్ గురించిన ఏ చిన్న వార్త అయినా ప్ర‌పంచానికి చాలా ఇంపార్టెంట్‌.  ఎందుకంటే ఆయ‌న ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో, ప్ర‌పంచానికి ఎలాంటి చేటు తీసుకొస్తారో అని భ‌య‌ప‌డుతుంటారు. గ‌త ఏడాది నుంచి అనేక‌మార్లు కిమ్ ప్ర‌పంచానికి, మీడియాకు దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఆయ‌న అలా దూరంగా ఉన్న‌న్ని రోజులు ప్ర‌పంచంలో తెలియ‌ని భ‌యం నెల‌కొనేది.  కిమ్ ఆరోగ్యం బాగాలేదా, లేదంటే ర‌హ‌స్యంగా ఏదైనా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారా?  లేదా అస‌లు కిమ్ ఉన్నారా చనిపోయారా అనే వార్త‌లు వ‌స్తుండేవి.  కిమ్ దాదాపుగా 140 కేజీల‌కు పైగా బ‌రువు ఉండ‌ట‌మే అందుకు కార‌ణం.  అయితే, కిమ్ జులై 24-27 తేదీల మ‌ధ్య‌లో మాజీ సైనికాధికారుల‌తో ఆయ‌న భేటీ అయ్యారు.  ఆ స‌మ‌యంలో ఆయ‌న త‌ల‌కు బ్యాండేజ్ వేసి ఉన్న‌ది. దీంతో చాలా మంది షాక్ అయ్యారు.  గ‌తంలో ఎప్పుడూ కూడా కిమ్ అలా క‌నిపించ‌లేదు.  పైగా బ‌రువు కూడా త‌గ్గిపోయారు.  ఈ విష‌య‌మే ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.  కిమ్ త‌ల‌కు ఎందుకు గాయం అయింది. మీడియాకు దూరంగా ఉన్న స‌మ‌యంలో కిమ్ శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నారా లేక మ‌రేదైనా కార‌ణ‌మా… కిమ్ త‌ల‌కు సంబందించిన ఆ బ్యాండేజ్ ర‌హ‌స్యం మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారిపోయింది.  

Read: తెలకపల్లి రవి: కెసిఆర్‌ వ్యూహాల జోరు, పథకాల హోరు!

Related Articles

Latest Articles