సమంత ‘లవ్ స్టోరీ’ గురించి ఏం చెప్పాలనుకుంటోంది!?

నిప్పు లేనిదే పొగరాదని కొందరంటారు. కానీ మీడియా నిప్పులేకుండానే పొగను సృష్టిస్తుందని మరికొందరు వాపోతుంటారు. అయితే ఫిల్మ్ సెలబ్రిటీస్ చేసే కొన్ని పనులు చూస్తే… అవి నిప్పులేకుండానే పొగను సృష్టించడం కాదనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పంజరంలో తాను ఉండలేని నర్మగర్భంగా ఓ మీడియా సంస్థకు సమంత చెప్పిందనే వార్తలు రావడంలో అందులో నిజం ఉందని చాలా మంది భావించారు. అయితే ఆ తర్వాత నాగార్జున బర్త్ డే కు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పడంతో చైతు – సమంత విడాకుల వార్తలో నిజం లేదని, అవి మీడియా సృష్టి అని కొందరు అన్నారు. నిజానికి పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులకు అప్లయ్ చేశారని, ప్రస్తుతం కౌన్సిలింగ్ దశలో కేసు ఉందని మరి కొందరు చెబుతున్నారు. దాంతో సమంత సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా… దానిని జాగ్రత్తగా గమనించి వ్యాఖ్యానించడం ఇటు సమంత, అటు నాగచైతన్య అభిమానులకు అలవాటైపోయింది. ఈ నేపథ్యంలో ఇవాళ విడుదలైన ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ లింక్ ను ట్వీట్ చేస్తూ సమంత పెట్టిన కామెంట్ కొత్త సందేహాలకు దారితీసింది.

త్వరలో విడుదల కాబోతున్న ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ లింక్ ను నాగచైతన్య ఇవాళ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కొంత సేపటికే సమంత ఆ ట్వీట్ లింక్ ను తన వాల్ మీద పోస్ట్ చేస్తూ ‘విన్నర్!! ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్ సాయిపల్లవి’ అంటూ అభినందించింది. అయితే… అందులో ప్రత్యేకంగా నాగచైతన్య పేరును ఆమె పేర్కొనకపోవడంతో వారి విడాకుల వ్యవహారంపై మరోసారి సోషల్ మీడియా రచ్చ మొదలైంది. చైతును సమంత పక్కన పెట్టేసిందని కొందరు నెటిజన్లు అంటే… మరికొందరు అలాంటిదేమీ లేదు… అసలు ఆమె లింక్ పెట్టిందే… నాగ చైతన్య ట్వీట్ ను కదా! అంటూ సర్థి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొంతమంది ఔత్సాహిక అభిమానులు… పాత రోజుల్లోకి వెళ్ళిపోయారు. జనవరి 10న ఇదే ‘లవ్ స్టోరీ’కి సంబంధించిన ఓ ట్వీట్ ను చైతు అక్కౌంట్ నుండి సమంత లింక్ చేసి నాగచైతన్య పేరును మెన్షన్ చేసిందని, కానీ ఇప్పుడు ఆ పనిచేయలేదని కంపార్ చేస్తున్నారు. మరి సమంత కావాలని చైతు పేరును పేర్కొనలేదా? లేక తమ రిలేషన్ పై సోషల్ మీడియాలో చర్చ జరగాలనే ఇలా చేసిందా అనేది తెలియదు! ఏదేమైనా ఇవాళ ఆమె చేసిన ట్వీట్ తో ఇటు చైతు – సమంత కలిసి ఉండాలనుకునే వారు, వారి మధ్య విభేదాలు ఉన్నాయని నమ్ముతున్న వారు సోషల్ మీడియా సాక్షిగా కౌంటర్లు వేసుకోవడం మొదలెట్టారు. మరి ఈ వివాదాలకు సమంత ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.

సమంత 'లవ్ స్టోరీ' గురించి ఏం చెప్పాలనుకుంటోంది!?
సమంత 'లవ్ స్టోరీ' గురించి ఏం చెప్పాలనుకుంటోంది!?
సమంత 'లవ్ స్టోరీ' గురించి ఏం చెప్పాలనుకుంటోంది!?

Related Articles

Latest Articles

-Advertisement-