‘మా’ ఎన్నికలకు టీడీపీకి ఉన్న లింకెంటీ?

‘మా’ ఎన్నికలు సృష్టిస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే ‘మా’లో రచ్చ నెలకొంది. ఎప్పుడైతే మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్(మా)కు నోటిఫికేషన్ విడుదలైందో అప్పటి నుంచే రచ్చ పీక్స్ కు చేరుకుంది. ఎన్నికల రిజల్ట్ వచ్చాక అందరూ కలిసిపోతారని భావించారు. అలాంటిదేమీ జరుగకపోగా ‘మా’లో చీలీకను కారణమవుతుందనే వాదనలు విన్పిస్తున్నాయి. దీంతో అసలు ‘మా’లో ఎం జరుగుతోంది. ‘మా’ అసోసియేషన్ రెండు గ్రూపులుగా విడిపోయిందా? అన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగుతోంది.

‘మా’కు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే ప్రకాశ్ రాజ్ అధ్యక్ష బరిలో నిలిచారు. మెగా కుటుంబ సపోర్టులో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు పోటీలో నిలిచారు. మంచు విష్ణు ప్యానల్ కంటే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ బలంగా ఉంది. ఈయన ప్యానల్లో హేమాహేమీలు ఉండటంతో ప్రకాశ్ ప్యానల్ గెలుపు నల్లేరుపై నడకేనని అంతా అనుకున్నారు. అయితే రిజల్ట్ మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది.

‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు బంపర్ మెజార్టీతో విజయం సాధించాడు. ఈసీ మెంబర్స్, ఆఫీర్స్ బెరర్స్ స్థానాల్లోనూ మంచు విష్ణు ప్యానెలే అధిక్యతను ప్రదర్శించింది. కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్లుగా ప్రకాశ్ రాజ్ ఓటమికి అనేక కారణాలు కన్పిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా లోకల్, నాన్ లోకల్, క్యాస్ట్ ఫీలింగ్ అంశాలు కన్పిస్తున్నాయి. ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అయినందుకే  ‘మా’ ఓటర్లు ఆయన్ని ఆదరించలేదని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఈ కారణంతోనే ఆయన ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ప్రకాశ్ రాజ్ బాటలోనే తన ప్యానల్ నుంచి గెలిచిన 11మంది సభ్యులు సైతం ఇటీవల మూకుమ్మడి రాజీనామాలు చేశారు. అయితే ఈ వివాదం కాస్తా ఏపీలోని టీడీపీ మెడకు చుట్టుకునేలా కన్పిస్తోంది. మంచు విష్ణు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో వారంతా ఏకమై అతడిని గెలిపించుకునే వాదనలు విన్పిస్తున్నాయి. ఇండస్ట్రీలో కమ్మలంతా ఏకమైన కాపులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాపు సామాజిక వర్గానికి చెందిన మెగా బ్రదర్ నాగబాబు ప్రకాశ్ రాజ్ కు మద్దతు ఇవ్వడంతోనే కమ్మలంతా ఏకమైనట్లు ఆయన్ని ఓడించారని భావిస్తున్నారు. దీంతో ఇండస్ట్రీలో కమ్మ వర్సెస్ కాపు అంశం తెరపైకి వచ్చింది. ‘మా’ ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం అనేక అక్రమాలకు పాల్పడి మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిందని కాపులంతా రగిలిపోతున్నారు. ఇటీవల వైసీపీ సర్కారుపై పవన్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. అయితే కాపుల్లో వస్తున్న వ్యతిరేకత టీడీపీ ఆశలపై నీళ్లు చల్లేలా కన్పిస్తోంది.

సినీ పరిశ్రమలో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ‘మా’ ఎన్నికల్లో వీరంతా ఏకమై ప్రకాశ్ రాజ్ ను ఓడించినట్లు కాపు నేతలు భావిస్తున్నారు. మెగాబ్రదర్ నాగబాబు రాజీనామాతో దీనికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని కాపు యువ‌త ర‌గిలిపోతోందని సమాచారం. రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గాలు తమ అధికారాన్ని నిలుపుకునేందుకు కాపులను అణగదొక్కుతున్నారని వారు భావిస్తున్నారు. దీంతో తామంతా ఏకమై కమ్మ నేతలకు బుద్దికి చెప్పాలని భావిస్తున్నారు. ఈ అంశం ఖచ్చితంగా టీడీపీకి మైనస్ అయ్యేలా ఉండటంతో ఆపార్టీలో ఆందోళన మొదలైంది.

-Advertisement-‘మా’ ఎన్నికలకు టీడీపీకి ఉన్న లింకెంటీ?

Related Articles

Latest Articles