రషీద్ అద్భుత ప్రదర్శన.. వెస్టిండీస్ చెత్త రికార్డు

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ అదరగొట్టాడు. గ్రూప్-1లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు అద్భుత గణాంకాలను నమోదు చేశాడు. 2.2 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన రషీద్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రషీద్ విజృంభణతో 14.2 ఓవర్టలో వెస్టిండీస్ 55 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ ముందు 56 పరుగుల స్వల్ప విజయలక్ష్యం నిలిచింది. క్రిస్ గేల్ చేసిన 13 పరుగులే వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో అత్యధికం. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ 4 వికెట్లు, మొయిన్ అలీ 2 వికెట్లు, టైమల్ మిల్స్ 2 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, జోర్డాన్ చెరో వికెట్ సాధించారు.

Read Also: థ్రిల్లింగ్ మ్యాచ్… దక్షిణాఫ్రికాపై ఆసీస్‌దే విజయం

కాగా ఈ మ్యాచ్‌లో 55 పరుగులకే ఆలౌటైన వెస్టిండీస్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఆ జట్టు మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఆ జట్టుకు సైతం ఇది టీ20లలో మూడో అత్యల్పం కావడం గమనార్హం. 2014లో శ్రీలంకపై నెదర్లాండ్స్ 39 పరుగులకే ఆలౌటైంది. అదే ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యల్ప స్కోరు. రెండో అత్యల్ప స్కోరు కూడా నెదర్లాండ్స్ టీందే. ఈ ఏడాది గ్రూప్ క్వాలిఫైయింగ్ మ్యాచులో శ్రీలంక జట్టుపై నెదర్లాండ్స్ 44 పరుగులకే ఆలౌటైంది.

Related Articles

Latest Articles