ఒమిక్రాన్ ఎఫెక్ట్… బెంగాల్‌లో విద్యాసంస్థలు బంద్

ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమలవుతుండగా… ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మరో అడుగు ముందుకేసింది. దాదాపు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. సోమవారం నుంచి విద్యాసంస్థలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, పార్కులు మూసివేస్తున్నట్లు తెలిపింది.

Read Also: కలవరపెడుతున్న ఒమిక్రాన్… తెలంగాణలో 84కి చేరిన కేసులు

మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు 50శాతం సిబ్బందితోనే కార్యకలాపాలు సాగించాలని బెంగాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏవైనా పాలన పరమైన సమావేశాలు ఉంటే వర్చువల్‌గా నిర్వహించుకోవాలని సూచించింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శి ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. కాగా దేశంలో ఒమిక్రాన్ వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధించిన తొలి రాష్ట్రం పశ్చిమ బెంగాల్ మాత్రమే.

Related Articles

Latest Articles