యోగీపై మోడీ ప్ర‌శంస‌లు…దీదీ విమ‌ర్శ‌లు…

నిన్న‌టి రోజుల ప్ర‌ధాని మోడీ వార‌ణాసిలో ప‌ర్య‌టించారు.  ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌ల‌ను చేశారు.  ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.  క‌రోనా సెకండ్ వేవ్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో యోగి సర్కాల్ స‌ఫ‌లం అయింద‌ని, దేశంలో అత్య‌ధిక సంఖ్య‌లో కరోనా టెస్టులు నిర్వ‌హించార‌ని, ట్రీట్మెంట్ అందివ్వ‌డంలో యూపి ముందు వ‌ర‌స‌లో ఉంద‌ని, అదే విధంగా రాష్ట్రంలో ఆడ‌పిల్ల‌ల ర‌క్ష‌ణ‌కు యోగీ స‌ర్కార్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు అద్భుతం అని కొనియాడారు.  

Read: హారర్ మూవీ ఫ్రాంచైజ్ లో మరో సీక్వెల్… ఆర్జీవీ సన్నాహాలు

యోగి స‌ర్కార్‌పై మోడీ ప్ర‌శంస‌లు కురిపించ‌గా, బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీ తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు.  క‌రోనాను క‌ట్ట‌డి చేస్తే గంగాన‌దిలో శవాలు ఎందుకు కొట్టుకొచ్చాయ‌ని విమ‌ర్శించారు.  బీజేపీ పాలిత రాష్ట్రం కావ‌డం వ‌ల‌నే యోగీ స‌ర్కార్‌కు స‌ర్టిఫికెట్ ఇచ్చార‌ని మ‌మ‌త బెనర్జీ దుయ్య‌బ‌ట్టారు.  పశ్చిమ బెంగాల్ కూడా కోవిడ్ క‌ట్ట‌డికి ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంద‌ని, అందుకే గంగాన‌దిలో శ‌వాలు క‌నిపించ‌లేద‌ని అన్నారు.  యోగి స‌ర్కార్ సెకండ్ వేవ్ ను అడ్డుకోవ‌డంలో పూర్తిగా విఫ‌లం అయింద‌ని అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-