యూట్యూబ్ వీడియోలకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరోవైపు షార్ట్ వీడియోలకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది.
కొద్దీ సమయంలో చెప్పాలనుకున్న కంటెంట్‌ను స్పష్టంగా చెప్పేందుకు ఇవి ఉపయోగపడతాయి.
కంటెంట్ క్రియేటర్లు ఈ షార్ట్ వీడియోల ద్వారా భారీగా ఆదాయం ఆర్జిస్తున్నారు.
షార్ట్స్‌కు సంబంధించి యూట్యూబ్ సరికొత్త అపడేట్‌ను పరిచయం చేసింది. షార్ట్స్ నిడివిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈ కొత్త అప్‌డేట్ అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం షార్ట్స్ వీడియో నిడివి కేవలం 60 సెకండ్లలోపు మాత్రమే అనుమతిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సమయాన్ని పెంచారు.
ఇకపై షార్ట్ వీడయోల నిడివిని మూడు నిమిషాల వరకు పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.