యూట్యూబ్ అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌గా మారింది. లక్షలాది వీడియోలు యావత్ ప్రపంచాన్ని అలరిస్తున్నాయి.
ఈ యుగంలో చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో యూట్యూబ్ లేనివారు లేరనడంలో అతిశయోక్తి లేదు.
ఇంతలా ఉపయోగిస్తున్న యూట్యూబ్ గురించి చాలా మందికి తెలియని అనేక విషయాలు చూద్దాం.
ఫ్రిబ్రవరి 14, 2005 అంటే వాలెంటైన్స్ డే రోజున యూట్యూబ్ సేవలు ప్రారంభమయ్యాయి.
చాద్ హార్లీ, స్టీవ్ చెన్, జావెద్ కరీం అనే ముగ్గురు పేపాల్ సంస్థ మాజీ ఉద్యోగులు దీన్ని ప్రారంభించారు.
ప్రస్తుతం సరికొత్త వీడియోలతో అలరిస్తున్న యూట్యూబ్ మొదట్లో ఓ డేటింగ్ సైట్.
"ట్యూన్ ఇన్ హుక్ అప్"... పేరుతో మొదట్లో డేటింగ్ యాప్ గా రూపొందించారు.
అందమైన అమ్మాయిలు తమ వీడియోలను ఇందులో అప్ లోడ్ చేయాలని.. 100 డాలర్లు ఇస్తామని ప్రకటన ఇచ్చారు.
ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో ఎలాంటి వీడియోలనైనా అప్ లోడ్ చేసే అవకాశం కల్పించారు.
యూట్యూబ్‌ను ప్రారంభించిన 18 నెలల్లోనే గూగుల్ ఏకంగా 1.65 బిలియన్ డాలర్లుకు కొనుగోలు చేసింది.
నవంబరు 2006
నుంచి
గూగుల్ ఆధీనంలో యూట్యూబ్ ప్రస్థానం ప్రారంభమయ్యింది.