చాలా మందికి టీ లేనిదే రోజు మొదలవ్వదు. ఇంకా చెప్పాలంటే గ్రామాల దగ్గర నుంచి నగరాల వరకు పదిమంది కలిసి ఎక్కువసేపు ఉండే ప్రదేశం టీ కొట్టు.
అంతేకాకుండా దేశంలో నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయం టీ కావడం విశేషం. ఒక కప్పు టీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
కొంతమంది టీతో పాటు అనేక రుచికరమైన స్నాక్స్ ను కూడా తింటూ ఆనందిస్తూ ఉంటారు.
అయితే టీ తో పాటు కొన్ని పదార్థాలు తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుందని చాలామందికి తెలియదు.
టీ తో పాటు పకోడీ అసలు తినకూడదు. దీనివల్ల జీర్ణ క్రియ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎసిడిటీ సమస్య మొదలవుతుంది.
టీ తో పాటు పసుపుతో చేసిన ఆహారాలు అసలు తినకూడదు. దీని వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్దక సమస్యలు ఎదురవుతాయి.
పసుపు, టీ ఆకుల కలయిక ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. టీ తో చల్లని ఆహార పదార్థాలు తినడం ఆరోగ్యానికి ఎంతో హానికరం.
దీనివల్ల అజీర్తి సమస్య ఏర్పడుతుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను ఆటంకం కలిగిస్తుంది. వికారం, వాంతులు లాంటి సమస్యలు ఎదురవుతాయి.
టీలో టానిక్, ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరం నుంచి ఐరన్ ను బయటకు పంపిస్తుంది.
చాలామంది ఫిట్ గా ఉండేందుకు లెమన్ టీ తాగుతుంటారు. దీని వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఇది కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది .ఎందుకంటే నిమ్మకాయలో సిట్రస్ ఉంటుంది కాబట్టి.
చాలా మంది స్వీట్ బిస్కెట్లను టీతో పాటు తినడానికి ఇష్టపడతారు. తీపి బిస్కెట్లను టీతో కలిపి తీసుకుంటే షుగర్ రిస్క్ పెరుగుతుంది. శరీరంలో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటే అది ముఖంపై మొటిమలకు దారితీస్తుంది.